Praveen -Faima : జబర్దస్త్ కామెడీ షో వేదికగా పాప్యులర్ అయిన వారిలో ఫైమా ఒకరు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఫైమా అనేక కష్టాలు పడింది. జబర్దస్త్ లోకి వచ్చాక ఆమె ఫేట్ మారిపోయింది. తనదైన కామెడీ స్టైల్ డెవలప్ చేసుకున్న ఫైమా.. బుల్లితెర తెర ప్రేక్షకుల్లో పాపులారిటీ రాబట్టింది. స్టార్ కమెడియన్ అయ్యింది. ఆ ఫేమ్ తో ఆమెకు బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్ట్ చేసిన ఫైమా సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన 13 వారాలు రాణించింది.
కాగా బిగ్ బాస్ హౌస్లో ఫైమా తన ప్రియుడు ప్రవీణ్ అని పరోక్షంగా వెల్లడించింది. తన వద్ద ఏమీ లేనప్పుడు ప్రవీణ్ అండగా నిలబడ్డాడు. తనకు ఏ సమస్య వచ్చినా పక్కన ఉండి పరిష్కరించాడని ప్రవీణ్ ని ఓ రేంజ్ లో లేపింది. ఎలిమినేట్ అయిన ఫైమాకు ప్రవీణ్ ఘన స్వాగతం పలికాడు. కొన్నాళ్ళు వీరి రిలేషన్ సవ్యంగానే సాగింది. ఏమైందో తెలియదు ప్రవీణ్ ని ఫైమా దూరం పెట్టింది. ఒకటి రెండు సందర్భాల్లో ప్రవీణ్ తన వేదన వెళ్లగక్కాడు. తన గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్న ప్రవీణ్ పై ఫైమా ఫైర్ అయ్యింది.
తాజాగా మరోసారి ప్రవీణ్ గుండెలపై తన్నింది ఫైమా. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వచ్చిన ప్రవీణ్.. ఫైమా పేరు చెప్పకుండా ఓ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాను. కానీ నన్ను రిజెక్ట్ చేస్తుంది. తన మనసు మారాలని కోరుకుంటున్నాను.. అంటూ మాట్లాడాడు. అదే షోలో ఉన్న ఫైమా… ఫైర్ అయ్యింది. నువ్వు మాట్లాడిన తీరు నాకు నచ్చలేదు. నాకు పెళ్లి కుదిరింది, నా ప్రస్తావన తేవద్దని చెబుతున్నా.. అదే చేస్తున్నావు. ఇకపై నేను జీవితంలో మాట్లాడను, అని కఠినంగా మాట్లాడింది. దాంతో ప్రవీణ్ కన్నీరు పెట్టుకున్నారు. భవిష్యత్ లో ఆమె గురించి నేను మాట్లాడను. నన్ను ఎవరూ తన గురించి అడగవద్దు, అని కన్నీరు మున్నీరు అయ్యారు.
ప్రవీణ్ మాటలు విన్న పలువురు అతనిది ప్యూర్ లవ్ అంటున్నారు. ఫైమా మనసు మారి ప్రవీణ్ ప్రేమను అంగీకరించాలని కోరుకుంటున్నారు. ఇక ప్రవీణ్-ఫైమాలు మధ్య జరుగుతున్న ఈ డ్రామా అంతా నిజమా లేక, వ్యూస్ కోసం ఇలా కంటెంట్ ఇస్తున్నారా? అనేది తెలియదు. బుల్లితెర షోలలో సాధారణంగా ఇలాంటి ఫ్రాంక్స్ జరుగుతుంటాయి. ప్రేక్షకులలో ఆసక్తి రేపడం కోసం ఈ తరహా కంటెంట్ ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేస్తారు.
Web Title: Praveen and faimas tearful breakup love story on live
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com