Salaar Teaser: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ సెప్టెంబర్ 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. టీజర్ లో ఎలివేషన్ డైలాగ్ అదిరింది. షాట్స్ బాగున్నాయి, కానీ ఒకే ఒక్క నిరాశ ఏమిటంటే, ఈ టీజర్ లో ప్రభాస్ ముఖాన్ని చూపించకపోవడమే.
తెల్లవారు జామున అభిమానులు , ప్రేక్షకులు అలారం పెట్టుకొని మరీ లేచింది ప్రభాస్ ని చూసేందుకే, అలాంటిది ప్రభాస్ షాట్స్ చాలా తక్కువ గా చూపించి ఆయన క్యారక్టర్ కి బిల్డ్ అప్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన న్యారేషన్ స్టైల్ కూడా KGF తరహాలోనే ఉంది. ప్రభాస్ క్లోజ్ అప్ షాట్స్ ని అయితే దాచి ఉంచారు కానీ, పృథ్వి రాజ్ సుకుమారన్ షాట్ ని మాత్రం క్లోజ్ అప్ లో పెట్టారు .
ఇక ఈ టీజర్ ప్రారంభం లో ప్రముఖ నటుడు టిల్లు ఆనంద్ చెప్పిన డైలాగ్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. ‘లయన్ , చీతా, టైగర్ , ఎలిఫెంట్ ఇవన్నీ చాలా డేంజర్, కానీ జురాసిక్ పార్క్ లో మాత్రం కాదు, ఎందుకంటే అక్కడ ఒక డైనోసర్ ఉంది’ అంటూ ప్రభాస్ ని ఎలివేట్ చేస్తూ చెప్పిన డైలాగ్ లో ప్రశాంత్ నీల్ మార్క్ కనిపించింది.
అంతే కాకుండా ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నట్టు డైరెక్టర్ టీజర్ తోనే చెప్పేసాడు. పార్ట్ 1 అంటూ క్రింద క్యాప్షన్ గా సీజ్ ఫైర్ అని పెట్టాడు. సీజ్ ఫైర్ అంటే యుద్దాన్ని ఆపడం, మరి సలార్ చిత్రం మొత్తం వయొలెన్స్ తో నిండిపోయి ఉంటుంది అని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పాడు. కానీ ఈ క్యాప్షన్ పెట్టడానికి కారణం ఏమిటి అనే విషయం మాత్రం ఫ్యాన్స్ కి అర్థం కాలేదు. మొత్తానికి టీజర్ కి అయితే అభిమానుల నుండి డివైడ్ టాక్ వచ్చింది.