Pragathi: తెలుగు ప్రేక్షకులకు ప్రగతి పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఆమె కూడా ఒకరు. ప్రగతి వందల చిత్రాల్లో అమ్మ, అత్త వంటి పాత్రలు చేశారు. సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీ రోల్స్ లో కనిపించే ప్రగతి రియల్ లైఫ్ లో ఫైర్ అని చెప్పాలి. ఆమె నచ్చింది చేసేస్తోంది. తన మనసుకు తోచిట్లు ప్రవర్తిస్తుంది. ప్రగతి మొదట్లో డాన్స్ వీడియోలు చేసేది. తర్వాత జిమ్ వీడియోలు కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది.
ప్రగతి ఫిట్నెస్ వీడియోలు ట్రోల్ కి గురయ్యాయి. ఈ వయసులో మీకు అవసరమా అంటూ పలువురు విమర్శలు చేశారు. సదరు విమర్శలను తన శైలిలో తిప్పికొట్టింది ప్రగతి. నా హెల్త్, ఫిట్నెస్ కోసం జిమ్ చేస్తున్నాను. మీకు ఇబ్బంది ఏంటి?. మీలాంటి వాళ్ళ కామెంట్స్ నేను పట్టించుకోను. నేను వ్యాయామం చేయడం ఆపను అంటూ గట్టిగా కౌంటర్లు విసిరింది. ఈ మధ్య ప్రగతి నేషనల్ కాంటెస్ట్ గెలిచారు.
బెంగుళూరులో జరిగిన నేషనల్ పవర్ లిప్టింగ్ కాంపిటీషన్ లో పాల్గొంది. ప్రొఫెషనల్స్ తో పోటీ పడి మూడో స్థానంలో నిలిచింది. నిజంగా ఇది గొప్ప విజయం అని చెప్పాలి. 47 ఏళ్ల ప్రగతికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు గీత. తన టీనేజ్ డాటర్ తో ఫోటోలు దిగి వాటిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది ప్రగతి. సదరు ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రగతి కూతురు గీత చాలా అందంగా ఉంటుంది. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమె సొంతం.
ప్రగతి చిన్న వయసులోనే వివాహం చేసుకుంది. కూతురు పుట్టాక భర్తతో విడిపోయింది. కెరీర్ బిగినింగ్ లో ప్రగతి హీరోయిన్ గా నటించింది. ఈ విషయం చాలా మందికి తెలియదు. పెళ్లి కారణంగా పరిశ్రమకు దూరమైంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బాబీ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ చేసే నాటికి ప్రగతి వయసు ముప్పై ఏళ్ల లోపే. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు.
View this post on Instagram