Site icon OkTelugu

LIK Movie Twitter Talk: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ ట్విట్టర్ టాక్ ఇదే.. సెకండ్ హాఫ్ ఈ రేంజ్ ఉంటుందని అనుకోలేదు..

LIK Movie 2 Days Collection

LIK Movie 2 Days Collection

LIK Movie Twitter Talk: వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్స్ తర్వాత యూత్ ఆడియన్స్ లో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కి అటు తమిళం లో , ఇటు తెలుగు లో ఏర్పడిన క్రేజ్ మామూలుది కాదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ యూత్ ఆడియన్స్ కి తగ్గట్టుగా ఎలాంటి సినిమాలు చేసేవాడో, ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ అలాంటి సినిమాలు చేస్తున్నాడు. ఇతన్ని చూస్తే మన పక్కింటి కుర్రాడిని చూసిన అనుభూతి కలుగుతుంది. అందుకే అందరికీ అంతలా కనెక్ట్ అయ్యాడు. అయితే ఆయన హీరో గా నటించిన ‘LIK’ చిత్రం అనేక వాయిదాలు తర్వాత నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైంది. లైసెన్స్ సమస్యల కారణంగా ఇండియా లో స్పెషల్ మార్నింగ్ షోస్ రద్దు అయ్యాయి కానీ , ఓవర్సీస్ లో మాత్రం ప్లాన్ ప్రకారమే షోస్ మొదలయ్యాయి అట. మరి అక్కడి ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం.

సినిమా విషయానికి వస్తే 2040 వ సంవత్సరం లో పరిస్థితులు ఎలా ఉంటాయి, టెక్నాలజీ కి బానిస అయినటువంటి యువత మధ్య ప్రేమ , పెళ్లి వంటివి ఎలా ఉండేవి అనే కాన్సెప్ట్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉందట , ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్నీ ఎలిమెంట్స్ తో మంచి ఫీల్ ని ఇస్తుందట. కానీ స్టోరీ లోని బలహీనతలు మొత్తం సెకండ్ హాఫ్ లో బయటపడుతాయట. సినిమా ఎక్కడ మొదలై , ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ అర్థం కాదు. చాలా సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయట. కానీ ప్రదీప్ రంగనాథన్, ఎస్ జీ సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని అద్భుతంగా ఉన్నాయట, ఫన్ కూడా బాగానే జెనెరేట్ చేసిందట ఈ కాంబినేషన్. ప్రొడక్షన్ విలువలు మాత్రం అద్భుతంగా ఉందట. నిర్మాత నయనతార మాత్రం ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని తీసినట్టు తెలుస్తోంది.

ఓవరాల్ గా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే , ఈ మూవీ స్క్రిప్ట్ కి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేసేంత సత్తా ఉంది. కానీ డైరెక్టర్ టేకింగ్ లో అక్కడక్కడా డ్రాగ్ చేయడం వల్ల , పర్వాలేదు , ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రమే కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే , ప్రదీప్ రంగనాథన్ ఎప్పటి లాగానే ఈ చిత్రం లో కూడా అద్భుతంగా నటించాడట. ముఖ్యంగా యువత కి నచ్చే విధంగా ఆయన చేసే స్టైలింగ్ , యాటిట్యూడ్ ఈ చిత్రం లో కూడా బాగా వర్కౌట్ అయ్యిందట. ఓవరాల్ గా యూత్ ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చే సినిమా, బజ్ లేకపోవడం వల్ల, ఈ సినిమా భవిష్యత్తు ఏంటో చెప్పలేక ఉన్నారు కానీ , ఇండియా లో షోస్ మొదలయ్యాక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాగా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version