Pradeep Ranganathan: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే వరుస బ్లాక్ బస్టర్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోలలో ఒకరు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలతో వరుసగా రెండు సార్లు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్న ప్రదీప్, ఇప్పుడు డ్యూడ్ చిత్రం తో ఈ నెల 17న మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్, పాటలు ఆడియన్స్ కి బాగా నచ్చడం తో,ఈ సినిమాపై క్రేజ్ మార్కెట్ లో వేరే లెవెల్ కి ఎగబాకింది. మన టాలీవుడ్ లో ఉన్న మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా ఈమధ్య కాలం లో ఇంత క్రేజ్ తో విడుదల అవ్వడం ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి, కానీ ఆడియన్స్ మొదటి ఛాయస్ మాత్రం ప్రస్తుతానికి డ్యూడ్ చిత్రమే.
కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా వీకెండ్ కి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకొని, దీపావళి విన్నర్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ లో కూడా ప్రదీప్ రంగనాథన్ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. తెలుగు, తమిళం లో వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ, ఈ సినిమాని జనాల్లోకి బాగా తీసుకెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ లో ప్రభాస్(Rebel Star Prabhas), హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్ లో ‘ఫౌజీ'(Fauji Movie) అనే చిత్రం తెరకెక్కుతుంది. చాలా వరకు షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా గురించి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఫౌజీ గురించి మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్స్ ఇవ్వలేదు. ఈ సినిమా టైటిల్ ఫౌజీ అనే క్లారిటీ కూడా ఇవ్వలేదు. కానీ ప్రదీప్ నిన్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘నేను ఫౌజీ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు చూసి షాక్ కి గురయ్యాను. అద్భుతంగా వచ్చాయి, ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే సెన్సేషన్ సృష్టించబోతోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. మేకర్స్ ఇప్పటి వరకు ఫౌజీ మూవీ టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రదీప్ మాత్రం అధికారికంగా ఫౌజీ టైటిల్ ని లీక్ చేయడం పై ప్రభాస్ అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయం లో ఈ సినిమా అవుట్ పుట్ గురించి గొప్పగా మాట్లాడినందుకు ప్రదీప్ ని ట్యాగ్ చేసి ధన్యవాదాలు కూడా చెప్తున్నారు.