Pradeep Ranganathan: ఇండస్ట్రీలో సినిమా పిచ్హోళ్ళు చాలా మంది ఉంటారు. ప్రతి క్షణం సినిమాకోసమే ఆలోచిస్తూ మంచి పొజిషన్ ను చేరుకోవాలనుకుంటారు. కానీ దాన్ని కొందరు మాత్రమే సహకారం చేసుకోగలరు… ఎవరైతే ఓపిగ్గా తన పనిని తాను చేసుకుంటూ ఫలితం కోసం ఆశించకుండా ముందుకు సాగుతారో వాళ్లకే విజయం వరిస్తోంది… కష్ట సుఖాలతో సంబంధం లేకుండా అలుపెరగని బాటసారిగా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడే గమ్యం వరిస్తోందని ఒక గొప్ప కవి చెప్పిన మాటల్ని మనం ఈ సందర్భంలో గుర్తుచేసుకోక తప్పదు.ఈ మధ్యకాలంలో యువత చాలా మంది చెడు వ్యసనాలకు బానిసలై విచ్చలవిడిగా తిరుగుతుంటే సినిమా పిచ్చోళ్ళు మాత్రం ఒక్క అవకాశం కోసం కొన్ని వందల ఆఫీసు లు తిరుగుతుంటారు. ఒక చిన్న అవకాశం కోసం చాలా రోజులపాటు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇలా వచ్చిన నటుడే ప్రదీప్ రంగనాథన్…
మొదట దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికి ఆ తర్వాత హీరోగా మారి మంచి సినిమాలను చేస్తున్నాడు. తన స్వీయ డైరెక్షన్లో చేసిన ‘లవ్ టుడే’ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆ తర్వాత డ్రాగన్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఆయన డ్యూడ్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి… ప్రదీప్ రంగనాథన్ చేస్తున్న నటన రజినీకాంత్ ను పోలి ఉంటుందని ఆ నటుడు ధనుష్ ను కాపీ చేస్తున్నాడని చాలామంది చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తన ఓన్ టాలెంట్ తో ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి రజనీకాంత్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగాలనుకొని తన ప్రయత్నాలు చాలా గొప్పదని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం…
మనం ఎవర్ని కాపీ చేశాం ఏంటి అనేది కాకుండా మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళితే బాగుంటుంది. కొన్నిసార్లు కొంతమంది లెజెండరీ యాక్టర్లను కాపీ చేసిన కూడా అది అందంగానే కనిపిస్తోందని ఇంకొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం…