
Prabhas’s new movie : టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో మన అందరికి తెలిసిందే, బాహుబలి సినిమా తర్వాత ఆయన మన ప్రాంతీయ బాషా చిత్రాల హీరో నుండి పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు.ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమా తియ్యాలంటే కనీసం 300 కోట్ల రూపాయిల బడ్జెట్ అవుతుంది.ఆయన డిజాస్టర్ సినిమాలు కూడా 400 కోట్ల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబడుతున్నాయి.అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ప్రభాస్ కి బాహుబలి సిరీస్ తర్వాత ఒక్క హిట్ కూడా లేదు.
ప్రస్తుతం ఆయనకీ ఉన్న స్టార్ స్టేటస్ కి స్టామినా యావరేజి టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి, కానీ ఆ వండర్ క్రియేట్ చేసే డైరెక్టర్ ప్రభాస్ కి గత రెండు సినిమాలలో తగలేకపోవడం బాధాకరం .ముఖ్యం గా 250 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ‘రాధే శ్యామ్’ చిత్రం గత ఏడాది విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ గా నిల్చిందో మన అందరికి తెలిసిందే.
250 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి కేవలం 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, అంటే దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు వచ్చాయి అన్నమాట.అంత పెద్ద ఫ్లాప్ సినిమాని తీసిన డైరెక్టర్ ‘రాధా కృష్ణ’కి ప్రభాస్ మరో అవకాశం ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త జోరుగా ప్రచారం అవుతుంది.ఈమధ్యనే ప్రభాస్ ని కలిసి రాధాకృష్ణ ఒక స్టోరీ వినిపించాడని, గతంలో చేసిన తప్పులను రిపీట్ చెయ్యకుండా ఈసారి ప్రభాస్ కటౌట్ కి తగ్గ ఊర మాస్ యాక్షన్ సబ్జెక్టు ని సిద్ధం చేసాడని టాక్ వినిపిస్తుంది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మించబోతున్నారట.ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే మరియు రాజా డీలక్స్ అనే సినిమాలు చేస్తున్నాడు.వీటి తర్వాత ప్రభాస్ – హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.చేతిలో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి అయితేనే రాధాకృష్ణ తో సినిమా ఉంటుందని చెప్తున్నారు.