Prabhas
Prabhas : ఈశ్వర్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు ప్రభాస్. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అనంతరం రాఘవేంద్ర టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. ఈ మూవీ నిరాశపరిచింది. వర్షం మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు ప్రభాస్. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గోపీచంద్ ప్రధాన విలన్ గా చేయడం విశేషం. దర్శకుడు శోభన్ తెరకెక్కించారు. ఛత్రపతితో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. స్టార్ హీరోల జాబితాలో చేరాడు.
తెలివిగా ప్రభాస్ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సైతం చేశారు. నిజానికి అవి తన ఇమేజ్ కి భిన్నమైన జోనర్స్. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి ఈ కోవలోకి వస్తాయి. మిర్చి లో మాస్ యాక్షన్ అంశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఈ చిత్రాలతో ప్రభాస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది. అలాగే అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడటం మొదలుపెట్టారు.
అయితే మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ ప్రభాస్ చేయకూడదు అనుకున్నాడట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దిల్ రాజు మాట్లాడుతూ.. మలేషియాలో బిల్లా షూటింగ్ జరుగుతుంది. నేను, దశరథ్ అక్కడకు వెళ్లి ప్రభాస్ కి కథ వినిపించాము. ఆయనకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్కలేదు. సెకండ్ హాఫ్ సంతృప్తికరంగా లేదని ప్రభాస్ అన్నాడు. ఓకే మీరు హైదరాబాద్ వచ్చాక ఆఫీస్ కి రండి. స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేసి సిద్ధం చేస్తాను, అన్నాను.
ఒక రోజు ప్రభాస్ నా ఆఫీస్ కి వచ్చాడు. బయలు దేరే ముందు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయను అని చెప్పాలని ప్రభాస్ మైండ్ లో ఫిక్స్ అయ్యాడట. దారిలో కూడా అదే ఆలోచన ఆయన మనసులో ఉందట. ఏదో మొక్కుబడిగా కథ విని రిజెక్ట్ చేద్దామనుకున్న ప్రభాస్.. ఇంప్రెస్ అయ్యాడట. నేను ఈ మూవీ చేయకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను. కానీ నువ్వు మామూలోడివి కాదు. మొత్తం మార్చేసి నన్ను ఒప్పించావు. ఓకే ఈ ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము అన్నాడట.
ఆ విధంగా మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ పట్టాలెక్కింది,అన్నారు. ఈ మూవీలో ప్రభాస్ కి జంటగా కాజల్, తాప్సి నటించారు. 2011లో విడుదలైన మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ మనసు మార్చుకోవడం మంచిదయ్యింది.
Web Title: Prabhas thought that mr perfect movie should not be done but he was impressed after hearing the story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com