Bigg Boss 9 Telugu wild card entry: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో స్టార్ మా ఛానల్ లో దూసుకుపోతుంది. ఈ సీజన్ ప్రతీ ఎపిసోడ్ చాలా దమ్మున్న టాస్కులతో, ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ముందుకెళ్తుంది. గత సీజన్ ఆడియన్స్ కి చాలా బోర్ కొట్టించింది. టాస్కులు కూడా పాత సీజన్స్ లో పెట్టినవే పెట్టేవారు. కంటెస్టెంట్స్ మంచి తోపులు అయినప్పటికీ, గేమ్ ని సరిగా డిజైన్ చేయకపోవడం తో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సీజన్, యావరేజ్ స్టేటస్ కి పరిమితమైంది. కానీ ఈ సీజన్ అలా కాదు, మొదటి ఎపిసోడ్ నుండే మంచి ఫైర్ వాతావరణం మొదలైంది. హౌస్ లో గొడవలు, టాస్కులు , ఎంటర్టైన్మెంట్, ఇలా బిగ్ బాస్ నుండి ఆడియన్స్ ఏవైతే కోరుకుంటారో, అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. కంటెస్టెంట్స్ కూడా టాస్కులు ఇస్తే ప్రాణం పెట్టి ఆడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆడియన్స్ ద్రుష్టి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ పై పడింది. ఇప్పటికే ‘అగ్నిపరీక్ష’ షో నుండి దివ్య నిఖిత హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. సామాన్యుల క్యాటగిరీ లో ఇదే అగ్నిపరీక్ష షో నుండి మరొకరు వచ్చేవారం వైల్డ్ కార్డు గా రావొచ్చు. వీళ్ళు కాకుండా సెలబ్రిటీస్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా సీరియల్ హీరోయిన్ సుహాసిని, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఖరారు అయ్యారు. అమర్ దీప్ కూడా ఎంట్రీ ఇస్తారని అనుకున్నారు కానీ, ఆయన ఇంకా అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను ని కూడా బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు తెలుస్తుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ శ్రీను వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ద్వారా హౌస్ లోకి వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని బిగ్ బాస్ టీం భావిస్తోందట.
ప్రభాస్ శ్రీను రెబెల్ స్టార్ ప్రభాస్ కి వ్యక్తిగత అసిస్టెంట్ అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అందుకే ఆయన పేరు ముందు ప్రభాస్ అని జత చేశారు. ఆ పేరుతోనే ఇప్పటికీ కొనసాగుతున్నాడు. సినిమాల్లో ప్రభాస్ శ్రీను ఇప్పటికీ బిజీ గానే కొనసాగుతున్నాడు. ఆయన గత చిత్రం ‘సింగిల్’. ఇందులో ఆయన కామెడీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన ఇంకా రెండు మూడు సినిమాలు చేసాడు. అవి విడుదలకు దగ్గర్లో ఉన్నాయి. మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టు కావడంతో రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఇస్తున్నారట. వారానికి 5 లక్షల రూపాయిలు డిమాండ్ చేసాడట. అంత మొత్తం ఇవ్వడానికి బిగ్ బాస్ టీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఈయన హౌస్ లోకి రావడం దాదాపుగా ఖరారు అయ్యినట్టే.