Prabhas Speech: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie) చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే నెల 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని కూకట్ పల్లి గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులకు పాసులు ఇవ్వకుండా చాలా లిమిటెడ్ గా పాసులు మాత్రమే ఇచ్చారు. అయినప్పటికీ అభిమానులు బారులు తీశారు. ఇక ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడిన మాటలు అభిమానులను ఎంతో ఉత్సాహ పరిచాయి. సాధారణంగా ప్రభాస్ తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడేందుకు సిగ్గు పడుతూ ఉంటాడు. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం అభిమానులతో కాస్త సరదాగా మాట్లాడేందుకు ప్రయత్నం చేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా చాలా సరదాగా సాగిపోయింది. డైరెక్టర్ మారుతీ తో నేను ఒక్కటే చెప్పాను. ఈమధ్య కాలం లో నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసి చాలా రోజులు అయ్యింది. ఎంతసేపు యాక్షన్ మూవీస్ చేసి బోర్ కొట్టేసింది. కాస్త ఎంటర్టైన్మెంట్ ని జోడించి ఒక మంచి హారర్ సినిమా చేయమంటే ఈ రాజా సాబ్ చిత్రం చేసాడు. ఈ సినిమా చూసిన తర్వాత మారుతీ రైటింగ్ స్టైల్ కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. ఒక హారర్ మూవీ కి ఇలాంటి క్లైమాక్స్ కూడా పెట్టొచ్చా అని అనిపించేలా చేసాడు. క్లైమాక్స్ మా వాడు పెన్ తో రాయలేదు, మిషన్ గన్ తో రాశాడు. అంత అద్భుతంగా వచ్చింది. ఇక తమన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమధ్యనే ఆయన ఒక లేటెస్ట్ సినిమాకు(ఓజీ) అందించిన మ్యూజిక్ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనమంతా చూసాము’.
‘ఈ సినిమాకు కూడా ఆయన అద్భుతమైన మ్యూజిక్ ని అందించాడు. రీ రికార్డింగ్ వర్క్ చేస్తున్నాడు ప్రస్తుతం , డార్లింగ్ నీ చేతిలో పెట్టేస్తున్నాం, కుమ్మేయండి. ఇక సినిమాకు అసలు సిసలు హీరో విశ్వప్రసాద్ గారు. మూడు సంవత్సరాల నుండి సినిమా సెట్స్ మీద ఉంది, అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయినప్పటికీ ఆయనలో ఇసుమంత టెన్షన్ కూడా లేదు. అసలు మీరు ఏమి తింటున్నారు సార్, అదేదో చెప్తే మేము కూడా ట్రై చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇక సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల గురించి మాట్లాడుతూ ‘ఈ సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్నీ హిట్ అవ్వాలి. ఎంతైనా సీనియర్ , సీనియరే(చిరంజీవి). వాళ్ళని చూసే మేము నేర్చుకున్నాము. వాళ్ళ సినిమాలు హిట్ అవ్వాలి, మాది కూడా హిట్ అయితే సంతోషిస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.