Prabhas And Maruthi: మీడియం రేంజ్ హీరోలతో వరుస సక్సెస్ లను సాధించిన మారుతి టైర్ వన్ హీరో అయిన ప్రభాస్ తో రాజాసాబ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన చాలావరకు డీలా పడిపోయాడు… ఇక ప్రభాస్ అభిమానులు ఈ సినిమా గురించి చాలావరకు ఊహించుకున్నారు. కానీ వాళ్ళ ఊహలకు తగ్గట్టుగా ఈ సినిమా లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా మీద తీవ్రమైన విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఈ విషయాన్ని గమనించిన ప్రభాస్ సైతం మారుతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి సినిమా చేస్తానని చెప్పి ఇలాంటి సినిమా చేశావు అంటూ ప్రభాస్ మారుతితో మాట్లాడడట. మొత్తానికైతే మారుతి చేసిన ప్రయోగం బాగున్నప్పటికి అందులో చాలా వరకు కన్ఫ్యూజన్స్ ఉండడంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది.
కారణమేదైనా కూడా ఒక స్టార్ హీరోని డీల్ చేస్తున్నప్పుడు కంటెంట్ లో చాలా వరకు మార్పులు చేర్పులు చేసి ఆ స్టార్ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమాను చేయాలి. అలాంటప్పుడే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. లేకపోతే మాత్రం విమర్శలను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అనేది మారుతిని చూస్తే అర్థమైపోతుంది.
నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రభాస్ అభిమానులు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా మారుతికి స్టార్ హీరోలు అవకాశం ఇచ్చే ఛాన్సులైతే లేవు. ఎందుకంటే ప్రభాస్ లాంటి స్టార్ హీరోను పూర్తిగా వాడుకోలేకపోయిన చాలామంది విమర్శలనైతే మూటగట్టుకున్నాడు.
ఇక తాను అనుకున్నట్టుగానే ఈ సినిమా మీద భారీ విమర్శలైతే వస్తున్నాయి. మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా మీద తన సమయాన్ని కేటాయించిన మారుతి ఇలాంటి సినిమా చేస్తాడని ఎవరు అనుకోలేదు… ఏది ఏమైనా కూడా వీలైనంత తొందరగా ఆయన తేరుకొని సక్సెస్ ని సాధిస్తే సరిపోతుంది. లేకపోతే మాత్రం ఆయన భారీగా డీలా పడిపోతాడనే చెప్పాలి…