Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) వరుసగా సినిమాలు మీద సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రాజా సాబ్(The Raja Sab Movie), హను రాఘవపూడి మూవీ(Hanu Raghavapudi ), స్పిరిట్(Spirit Movie) వంటి చిత్రాలతో పాటు సలార్, కల్కి సీక్వెల్స్ కూడా ఉన్నాయి. ఇవి పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుంది అనుకుంటే, ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాని లైన్ లో పెట్టేసాడు. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడని చాలా కాలం నుండి ఒక రూమర్ ఉంది. కానీ అది రూమర్ కాదు, నిజమే అని మాకు అందుతున్న విశ్వసనీయ సమాచారం. రేపు ప్రభాస్ కి సంబంధించిన లుక్ టెస్ట్ ని చేయబోతున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ లుక్ టెస్ట్ పూర్తి అయిన కొద్దీ రోజులకు ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరుగుతాయట. ఈ సినిమాకి ‘బ్రహ్మ రాక్షస’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ప్రభాస్ మొట్టమొదటిసారిగా నెగటివ్ షేడ్ రోల్ లో ఈ సినిమా ద్వారా మనకి కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి దాదాపుగా 600 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. కానీ అవతల సందీప్ వంగ ప్రభాస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీ గా ఉండే ప్రభాస్, ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లోకి అడుగుపెడితే, మరో సినిమా చేసేందుకు వీలు లేదని చాలా కఠినమైన రూల్స్ పెట్టాడట డైరెక్టర్ సందీప్ వంగ. మరి ప్రశాంత్ వర్మ సినిమా ఏమో ఈ ఏడాది లోనే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుంటుంది అని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ‘స్పిరిట్’ చిత్రం మొదలు పెడుతాడా?, లేకపోతే ‘స్పిరిట్’ తర్వాత చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ కొన్ని రోజులు రాజా సాబ్ మూవీ షూటింగ్ లో, మరికొన్ని రోజులు హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. ‘రాజా సాబ్’ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది . ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ, దసరా కి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉగాదికి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉండడం తో ఈ సినిమాని వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన ప్రభాస్, ఈసారి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే సరిపెట్టాల్సి వచ్చింది.