Prabhas Retirement : పాన్ ఇండియా రేంజ్ లో తనదైన సత్తా చాటుతున్న సలార్ సినిమా తనదైన రీతిలో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ మంచి వసూళ్లను సాధిస్తుంది. ఇక సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్నా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా సక్సెస్ పట్ల ప్రశాంత్ నీల్ తనదైన రీతిలో స్పందించాడు. ఈ సినిమా సక్సెస్ ని తను ముందే ఊహించినట్టుగా చెబుతూనే ప్రభాస్ గారికి మొదటి నుంచి ఒక సక్సెస్ ఇవ్వాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నట్టుగా చెప్పాడు.
అలాగే ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని అందుకే ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే చాలు అని చాలాసార్లు అనుకున్నాను. అనుకున్నదే తడవుగా ప్రభాస్ కి ఒక స్క్రిప్ట్ చెప్పగానే ఆయనకు నచ్చింది. అదే సలార్ స్క్రిప్ట్ ఇక నేను కూడా ఆలస్యం చేయకుండా ఈ సినిమాని తెరకెక్కించాను ఇప్పుడు అది రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అవడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తి చెందడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు…ఇక ఈ సినిమా వల్ల ప్రభాస్ రేంజ్ అనేది మరో స్థాయికి వెళ్లిందనే చెప్పాలి.
ఇక ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఆరోగ్యం బాగుండడం లేదనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే కల్కి సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అన్నట్టుగా కూడా చాలా వార్తలొస్తున్నాయి.నిజానికి ప్రభాస్ కి ఏమైంది అంటూ కొద్దిరోజుల క్రితం చాలా వార్తలు వచ్చాయి. సలార్ సినిమాలో తను ఫిట్ గా కనిపించినప్పటికీ బయట మాత్రం ఆయన అంత ఫిట్ గా లేడు అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన చాలా రోజుల నుంచి కొద్దిపాటి అనారోగ్యానికి గురవడమే దానికి కారణం అని తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఒక నాలుగు ఐదు సినిమాలు మాత్రమే చేసి తను హీరోగా రిటైర్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటికే ఆయనకి ఆరోగ్యం బాగుండడం లేదు కాబట్టి ఆయన హెవీ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న సినిమాలు చేస్తే కుదరదు కాబట్టి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనేది క్లారిటీగా తెలియదు గానీ గత కొన్ని రోజులుగా మాత్రం ఇలాంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. ప్రస్తుతం బయట ప్రభాస్ ని చూస్తే ఆయన అంత ఫిట్ గా లేనట్టుగా అయితే తెలుస్తుంది. తను ఏదో అనారోగ్య కారణం వల్ల ఇబ్బంది పడుతున్నాడు అనేది మాత్రం చాలా క్లారిటీ గా కనిపిస్తుంది…