Salaar: ఈ మధ్య ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ కూడా నెటిజన్లను నిరాశ పరిచింది. దీంతో ఇప్పుడు ప్రభాస్, ఆయన అభిమానులు సలార్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా అవడంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ఎదురుచూస్తున్నారు నెటిజన్లు.
సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సిన సలార్ ఊహించని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో క్రిస్మస్ కు ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. దీంతో సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుందని ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. కానీ ఇదే క్రమంలో మరో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ఇది చిన్న అప్డేట్ కాదని.. అభిమానులను ఆనందంలో ముంచెత్తే న్యూస్ అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుంచి దీపావళికి బ్లాస్టింగ్ అప్డేడ్ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ బాబు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్స్ దీపావళికే రానున్నాయి. ఈ స్టార్ హీరోల సినిమా అప్డేట్ లతో పాటు ప్రభాస్ సలార్ అప్డేట్ వస్తే కూడా దీపావళి బొనాంజా పక్కా అంటున్నారు అభిమానులు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే సంస్థ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రవి బసృర్ సంగీతం అందివ్వగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషిస్తున్నారు. మరి చూడాలి ఈ సారి దీపావళి కానుకగా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారు అనేది..