
Sudheer Babu About Prabhas: ప్రభాస్.. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు మొత్తం అలాంటి సినిమాలే తీస్తున్నాడు. టాలీవుడ్ ను దాటి బాలీవుడ్, హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. అయితే అంత ఎత్తుకు ఎదిగినా కూడా తన మూలాలు మరిచిపోలేదు. తన స్నేహితుడు, హీరో సుధీర్ బాబు చిత్రం కోసం తాజాగా ప్రమోషన్ లో పాలుపంచుకున్నాడు.
హీరో సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ కోసం హీరో ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో తమ అనుభూతులు పంచుకున్నాడు. సుధీర్ బాబు తాను మంచి స్నేహితులమని.. సినిమా తొలినాళ్లలో కలిసి తిరిగేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా సుధీర్ బాబు ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రభాస్ తో మీకున్న అనుబంధం మీ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మధుర జ్ఞాపకాలను షేర్ చేసుకోండి అని సుధీర్ బాబును అడిగాడు. దీనికి సుధీర్ బాబు సమాధానమిచ్చాడు.
‘ప్రభాస్ నాకు ఆప్త మిత్రుడు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరి మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ నటించిన ‘వర్షం’ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా కటౌట్ చూడడం కోసం నేను, ప్రభాస్, సంగతీ దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ల వద్దకు వెళ్లాం.. ఆ తర్వాత ట్యాంక్ బండ్ కు చేరుకొని రాత్రంతా ‘వర్షం’ సినిమా పాటలు పాడుకుంటూ అక్కడే గడిపేశాం’ అని సుధీర్ నాటి స్నేహం తాలూకా గుర్తులను జ్ఞాపకం చేసుకున్నాడు.
ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ‘పలాస’ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.