Prabhas: కన్నడ పవర్ స్టార్.. రియల్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ప్రేక్షక హృదయాలను నేటికీ కలిచివేస్తూనే ఉంది. పునీత్ చేసిన సేవ గురించి నేటికీ ప్రేక్షకులు గొప్పగా చెప్పుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా పునీత్ లా మరొకరు ఎవ్వరూ సమాజ సేవ చేయలేదనే స్థాయిలో పునీత్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. పైగా తోటి సినీ తారలు కూడా ఇప్పటికీ పునీత్ విషయంలో ఎమోషనల్ అవుతూనే ఉన్నారు. భాషలతో సంబంధం లేకుండా ప్రజల మనసులను ఇప్పటికీ బాధతో కప్పేసే ఉంది.

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ టీజర్‌ను రిలీజ్ చేసిన ప్రభాస్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘జేమ్స్ రూపంలో ఒక మాస్టర్ పీస్‌ను చూడబోతున్నాం. పునీత్‌ని అభిమానించే కోట్ల మందికి ఇదో స్పెషల్ చిత్రంగా నిలిచిపోతుంది. వి మిస్ యూ పునీత్ సర్’ అని రాసుకొచ్చాడు. చేతన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న రిలీజ్ కానుంది.
Also Read: అరుదైన సినీ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు !
మొత్తమ్మీద పునీత్ ను తలుచుకుంటూ ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో.. ప్రస్తుతం ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. గతంలో ప్రభాస్ మరో ఏ హీరో గురించి ఇంతలా ఎమోషనల్ అవ్వలేదు. కానీ.. పునీత్ విషయంలో మాత్రం ప్రభాస్ ఇలా ఎమోషనల్ అవ్వడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇక పునీత్ రాజ్ కుమార్ కు ఘన నివాళి ఇచ్చేందుకు అమెజాన్ ప్రైమ్ కూడా సిద్ధమైన సంగతి తెలిసిందే. పునీత్ నటించి, నిర్మించిన ఐదు సినిమాలను.. అభిమానులు ఉచితంగా చూసే అవకాశం కల్పించింది అమెజాన్ ప్రైమ్ సంస్థ.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి – 28వ తేదీ వరకు పునీత్ సినిమాలను ప్రైమ్ లో ఉచితంగా చూడొచ్చని సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. అలానే పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న 3 కొత్త సినిమాలు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్’ కూడా తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ తెలిపింది. మొత్తానికి పునీత్ కు అమెజాన్ ప్రైమ్ సంస్థ ఘన నివాళి గా ఫ్రీగా 5 సినిమాలను చూపించడం గొప్ప విషయం.
అయితే.. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే.. కన్నడంలో అమెజాన్ ప్రైమ్ ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ఎన్నడూ లేనిది కన్నడ సినీ ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ ను ఓన్ చేసుకున్నారు. పునీత్ నివాళి గా ఫ్రీగా 5 సినిమాలను చూపించడం.. తమ సంస్థకు చాలా బాగా కలిసి వచ్చింది అని అమెజాన్ ప్రైమ్ టీమ్ అధికారికంగా తెలపడం విశేషం.
Also Read: పేటీఎం సూపర్ ఆఫర్.. నాలుగు రూపాయలు పంపితే రూ.100 గెలిచే ఛాన్స్!