Prabhas: ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రభాస్ మొదటి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆయనకి వర్షం సినిమాతో ఒక సూపర్ సక్సెస్ అనేది దక్కింది. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన వెనుతిరిగి చూడకుండా వరుసగా మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి పేరును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈయన సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకున్నాడు. అయితే ఈయనకు ముందు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి నటులు కూడా ఆయన దగ్గర యాక్టింగ్ శిక్షణ తీసుకొని యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకున్నారు. అయితే వాళ్ల బాటలోనే ప్రభాస్ కూడా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన దగ్గరే యాక్టింగ్ కి సంబంధించిన శిక్షణను తీసుకున్నాడు. అయితే ఇప్పుడు సలార్ సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో మరోసారి తన గురువు అయిన సత్యా నంద్ గారిని కలిసి ఆయనకి గోల్డ్ బ్రాస్లైట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక వీడియో అనేది తెగ వైరలవుతుంది.
నిజానికి ప్రభాస్ సమయం దొరికిన ప్రతిసారి సత్యానంద్ గారిని కలుస్తూ ఆయనతోపాటు కొద్ది సేపు సమయాన్ని కేటాయించి ఆయన్ని ఉత్సాహపరిచి వస్తూ ఉంటాడు. ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోలు మనం చాలా సార్లు చూసాం కానీ ప్రభాస్ ఈసారి ప్రత్యేకంగా అతనికి ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది నిజంగా ప్రభాస్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ప్రభాస్ చాలా దయాగుణం కలవాడు ఆయన అందరికీ బాగా రెస్పాండ్ అవుతూ, అందరిని చాలా రెస్పెక్టివ్ గా చూసుకుంటాడు అనేది మనకు చాలా బాగా అర్థం అవుతుంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా సక్సెస్ తో మంచి రేంజ్ లో ఉన్నాడు.ఇక దాంతో వాళ్ల గురువును కలిసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తను తర్వాత చేయాల్సిన కల్కి సినిమా షూట్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఆ సక్సెస్ ని ఒక నెలరోజుల పాటు ఎంజాయ్ చేసిన తర్వాత కల్కి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ప్రభాస్ తన అనుకున్న వాళ్ళని ఎప్పటికీ మోసం చేయడు వాళ్ళతో పాటే తను కూడా ఉంటాడు అనడానికి ఇదొక ఉదాహరణ…