Fauji Movie Update: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ప్రభాస్ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక హను రాఘవపూడి ఇప్పటి స్టార్ హీరోతో సినిమా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయి సంవత్సరం అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ ని కూడా ఇవ్వలేదు. తొందర్లోనే టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక బ్యాలెన్స్ షూట్ మొత్తాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే సంక్రాంతికి ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ‘సీతా రామం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హను ఇప్పుడు మరోసారి ప్రభాస్ తో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తుండటం విశేషం… ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ సాధిస్తాను అంటూ తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ప్రభాస్ తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సైతం చేయిస్తున్నారు. అవి కనక పర్ఫెక్ట్ గా సెట్ అయితే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలుస్తోంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా హను రాఘవపూడి నుంచి వచ్చిన సినిమాలు ప్యూర్ లవ్ స్టోరీలుగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో కూడా ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపిస్తూనే, యాక్షన్ ఎపిసోడ్స్ కి పెద్ద పీట వేస్తున్నాడు.
హను రాఘవపూడి స్టైల్ లవ్ స్టోరీ, ప్రభాస్ స్టైల్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతోంది. ఇక ప్రభాస్ అభిమానులైతే స్క్రీన్ మీద ప్రభాస్ ను చూసి మురిసిపోతారు అంటూ హను గతంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే ఈ సినిమాలో ప్రభాస్ అంత అందంగా ఉంటాడని ఆయాన చెప్పకనే చెప్పాడు…