
Prabhas Fans: తెలుగు సోషల్ మీడియాలో ఒక రూమర్ బాగా ప్రచారంలోకి వచ్చింది. దర్శకుడు మారుతి ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడని ఆ రూమర్ సారాంశం. అసలు ఈ వార్త వినడానికి కూడా నమ్మశక్యంగా లేదు. అయినా ఈ వార్త నిజమే అంటూ నెటిజన్లు కూడా షేర్ అండ్ లైక్ చేసి షాక్ అవుతున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది ? నిజంగానే ప్రభాస్, మారుతికి డేట్లు ఇస్తాడా ?
చిన్న చిన్న సినిమాలతో పెద్ద స్థాయికి ఎదగడానికి మారుతి ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతూ ఉన్నాడు. అసలు వెంకటేష్ లాంటి సీనియర్ హీరో ఇమేజ్ నే మ్యానేజ్ చేయలేక చేతులెత్తేసిన మారుతి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇమేజ్ ను ఎలా హ్యాండిల్ చేయగలడు ? తనకిప్పుడు స్టార్స్ తో సినిమా చేసే హోదా వచ్చేసినట్టే అని మారుతి నమ్మకంగా ఉండొచ్చు.
ఆ మధ్య అల్లు అర్జున్ తో మారుతి ఓ సినిమా చేయాలని బాగా ప్రయత్నం చేశాడు. మంచి టైమ్ చూసుకుని బన్నీని కలిసి కథ వినిపించాడు. బన్నీ కథ విని, బాగా లేదు, కథ మనకు సెట్ కాదు అంటూ మారుతిని సింపుల్ గా పక్కన పెట్టాడు. అప్పటి నుంచి మారుతి ఏకంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.
దాంతో ప్రభాస్ అభిమానులను మాత్రం ఈ వార్త బాగా టెన్షన్ పెడుతుంది. అయితే, ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే.. ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. మారుతికి ప్రభాస్ డేట్లు ఇచ్చే స్థితిలో లేరు. అసలు ఈ విషయం అవాస్తవం అని మారుతినే స్వయంగా చెప్పాడు. కాబట్టి.. ఈ వార్తను ఇక ఎవ్వరూ నమ్మక్కర్లేదు.
అసలు ఈ ప్రచారానికీ ఓ కారణం ఉంది. యూవీ సంస్థతో మారుతికి మంచి అనుబంధం ఉంది. మరోపక్క యూవీ అంటేనే ప్రభాస్, ప్రభాస్ అంటేనే యూవీ. అందుకే ఈ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ తో సినిమా చేస్తున్నానని కొన్ని వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు అని తాజాగా మారుతి క్లారిటీ ఇచ్చాడు.
Also Read: ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా యూనిట్‌కు ప్రభాస్, బన్నీ విషెస్…
ఆది పురుష్ 100రోజులు షూటింగ్ పూర్తి.. సెలెబ్రేట్ చేసుకున్న చిత్రయూనిట్