Spirit Prabhas Dual Role: అర్జున్ రెడ్డి సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… బోల్డ్ సినిమాతో భారీ సక్సెస్ సాధించవచ్చని నిరూపించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఆ తర్వాత ఆ సినిమాని ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత రన్బీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేసి మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ సందీప్ రెడ్డి వంగ చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఒకటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాగా, మరొకటి డాన్ పాత్రగా తెలుస్తోంది… ఇక సందీప్ ఈ సినిమాతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ అతని అభిమానుల నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లలో వేరియేషన్స్ చూపిస్తారట.
ఆ రెండు పాత్రల్లో ఉన్న వేరియేషన్స్ ఇంతకుముందు ఎప్పుడు చూపించలేదంటూ ఆ పాత్రలో ఉన్న క్లారిటీ అలా ఉంటుంది అంటూ సందీప్ చెబుతున్నారట. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మీద కొన్ని సన్నివేశాలు కూడా రాసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ ఈ సినిమాలో చాలా కోపం కలిగిన వ్యక్తిగా కనిపించబోతున్నాడట.
నిజానికి సందీప్ రెడ్డి వంగ అన్ని సినిమాల్లో హీరోకి కోపం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో సైతం అదే మరోసారి రిపీట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ పాత్రలో వేరియేషన్స్ ప్రభాస్ ఏ రేంజ్ లో చూపిస్తాడు తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది…