Prabhas And Prasanth Varma: రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) సినిమాల విషయం లో ఎంత దూకుడుగా ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. తన తోటి స్టార్ హీరోలు మూడేళ్లకు ఒక్క సినిమా చేయడానికే కష్టపడుతుంటే, ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ‘కల్కి’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్'(Rajasab Movie) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. 90 శాతం కి పైగా టాకీ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ విషయం లో ఆలస్యం అవుతుండడంతో వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంతో పాటు ఆయన హను రాఘవపూడి తో ఒక సినిమా, సందీప్ వంగ తో స్పిరిట్ అనే సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఆయన ప్రశాంత్ వర్మ(Prasanth varma) తో కూడా ఒక సినిమాని రీసెంట్ గానే ఒప్పుకున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ లుక్ టెస్ట్స్ లో కూడా పాల్గొన్నాడు. ఆయనతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే కూడా లుక్ టెస్ట్ లో పాల్గొన్నది. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ సినిమాకి టైటిల్ గా ‘బక'(Baka) అనే పేరుని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇదేమి విచిత్రమైన టైటిల్ రా బాబోయ్ అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘బక’ అనే ‘బకాసురుడు’ అని అర్థం అట. పురాణాల్లో బకాసురుడు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి చొరబడి బండెడు అన్నం, రెండు దున్నలు, ఒక మనిషిని ఆహారంగా తీసుకునేవాడు. ఈ క్యారక్టర్ ని ప్రభాస్ ఇందులో చేయబోతున్నాడట. ఇది వరకు పురాణాల్లో అందరి చరిత్రలు తెలుసు కానీ, బకాసురుడి పూర్తి చరిత్ర మాత్రం ఎవరికీ తెలియదు. అందుకే ఆ కోణం లో ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.
అంత పెద్ద పాన్ ఇండియన్ సూపర్ స్టార్ తో ఇలాంటి క్యారక్టర్ చేయించడం అంటే పెద్ద సాహసమే. కానీ ప్రభాస్ ఒప్పుకొని చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సుమారుగా 500 కోట్ల రూపాయిలు ఖర్చు చేయబోతున్నారట. చూడాలి మరి ప్రభాస్ ఈ యాంగిల్ లో అభిమానులను ఎంతమేరకు అలరిస్తాడు అనేది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ‘రాజా సాబ్’ కంటే ముందే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఈ ఏడాది లోనే ఆయన స్పిరిట్ మూవీ షూటింగ్స్ సెట్స్ లోకి కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.