Prabhas New Look: నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఫాంటసీ సైంటిఫిక్ మూవీగా రాబోతున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, దర్శకుడు నాగ్ అశ్విన్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కొత్తగా ఒక అఫీస్ పెట్టాడు. ఈ ‘వైజయంతీ మూవీస్ 2’ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి అమితాబ్ బచ్చన్ తో పాటు నాని మరియు దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొన్నారు. వీరంతా ప్రభాస్ తో కలిసి ఫోటో కూడా దిగారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఫోటోలో నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ కూడా ఉండటం.. వీరికి తోడు అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాని మరియు దుల్కర్ సల్మాన్ లు ప్రభాస్ తో కలిసి కనిపించడంతో ఈ పిక్.. స్పెషల్ పిక్ గా నిలిచిపోయింది. మొత్తానికి ఈ ఫోటోలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
Also Read: Krithi Shetty: కిస్ మీ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసిన కృతి కుట్టీ !
ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అనేక రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా పై అధికారిక అప్ డేట్ కావాలంటూ గత కొంత కాలంగా ట్విట్టర్ లో సినిమా మేకర్స్ కి మెసేజ్ లు పెడుతూ వస్తున్నారు. వారికీ ఈ పిక్ మంచి ట్రీట్ అనే చెప్పాలి. మొదటినుంచీ ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అందుకే నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా కథ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంతవరకూ తెలుగు సినిమా చూడని నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో సినిమా జరుగుతుందట. ప్లాష్ బ్యాక్ లో ఈ దివి సీన్స్ వస్తాయని.. అలాగే సినిమాలో మూడు కాలాలకు సంబంధించిన కథ ఉంటుందని.. అయితే అన్నిటిలోకల్లా దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.

అలాగే ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ కథలో రెండు విభిన్న పాత్రలను సృష్టించాడని.. పైగా పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా ప్లాన్ చేస్తున్నాడని.. అందుకే అన్ని భాషల వారికి నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని టీమ్ నమ్మకంగా ఉంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ సినిమాని భారీగా నిర్మించనున్నారు. మొత్తం సాంకేతిక బృందాన్ని కూడా హాలీవుడ్ లోని ప్రముఖులనే తీసుకుంది.