
డార్లింగ్ ప్రభాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు. ప్రభాస్ సినిమా అంటే.. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల టాలెంట్ కి గుర్తింపు అన్నట్టుగా భావిస్తున్నారు బాలీవుడ్ జనం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న తన 21వ సినిమాకే బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ రౌత్ తో మరో భారీ సినిమాని ప్రకటించి.. బాలీవుడ్ స్టార్స్ కి కూడా పోటీ ఇచ్చేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
Also Read: మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !
అసలు ప్రభాస్ ప్రకటించిన “ఏ- ఆది పురుష్” అనే టైటిలే కొత్తగా ఉంది. పైగా ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. నిజంగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో చేయకుండా, సౌత్ హీరోతో చేయడం నిజంగా ప్రభాస్ స్టార్ డమ్ కి దక్కిన గౌరవమే. పైగా ఈ సినిమాని 3డి విజువల్ గ్రాఫిక్స్ తో ఒక మహదాద్భుతంగా తెరకెక్కించి దేశంలోని అన్ని భాషలతో సహా విదేశాల్లోనూ అనువాదం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ పై అలాగే ప్రభాస్ క్యారెక్టర్ పై అప్పుడే ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది.
హాలీవుడ్ మూవీ `ది ఇమ్మోర్ట్స్ ఆఫ్ మెలుహా` సినిమాలోని మెలుహ పాత్రల శైలిలో ప్రభాస్ పాత్ర సాగుతోందట. ఇంతకీ ఈ మెలూహ అంటే నాగుల రహస్యం అన్నమాట. ఇప్పటికే రిలీజైన పోస్టర్ లోని ఒక లుక్ చూస్తుంటే.. మెలూహ తరహా లుక్ లానే అనిపిస్తుంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో మూడు పాత్రాల్లో కనిపిస్తాడని.. మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ కథలో శివుని పాత్రలో ప్రభాస్ ను విజువల్ వండర్ గా చూపించబోతున్నారని.. అలాగే శివుని పూజించే మెలుహన్స్ కథాంశమే ఈ సినిమా అని, అయితే ప్రభాస్ యోధుడు పాత్రతో పాటు మహాదేవుడి పాత్రలోనూ కనిపిస్తాడని తెలుస్తోంది.
Also Read: ఆర్ఆర్ఆర్ కు రైటర్ రాజమౌళి భార్య.. మరి సాయి మాధవ్?
అలాగే రామాయణ ఇతిహాసంలోని ఒక ముఖ్యమైన ఘట్టం ఆధారంగా ఈ సినిమాలోని చాలా భాగం ఉంటుందనే ప్రచారం కూడా వినిపిస్తోంది. అందుకే పోస్టర్ లో హనుమాన్ గెటప్ పెట్టారట. పైగా ప్రభాస్ ఈ చిత్రంలో హనుమాన్ పాత్రలో కనిస్తాడని.. కాకపోతే ప్రభాస్ హనుమాన్ గా సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తాడని.. పూర్తిగా రామాయణ కథ కాదు కాబట్టి.. అందులోని ఓ సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ని తీసుకుని.. సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన సీక్వెన్స్ లో ఆ హనుమాన్ ఎపిసోడ్ పెడతారని తెలుస్తోంది.