Game Changer: మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన హీరో ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’…ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటున్నాయి.ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఆయన మరొక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కనక అందుకున్నట్లైతే ఆయనను మించిన నటుడు మరొకరు ఉండరు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా మీద రోజు రోజుకి ప్రేక్షకుల్లో అంచనాలు తగ్గిపోతున్నాయి. ఇక దానికి కారణం శంకర్ ఈ సినిమా మీద ఎలాంటి అప్డేట్ ని ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా నుంచి పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు గాని, టీజర్ ని గాని, ట్రైలర్ గానీ రిలీజ్ చేయడం లేదంటూ సినిమా అభిమానుల్లో చాలావరకు అసహనం అయితే వ్యక్తమవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా కోసం ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటించబోతున్నాడనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి.
నిజానికి పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం.. ఆయన కోసం ఏదైనా చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటాడు. దానికోసమే సినిమా మీద హైప్ ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఒక కీలక పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ దీని కోసమే రెండు రోజుల డేట్స్ ను కూడా ఈ కేటాయించినట్టుగా తెలుస్తోంది. సినిమా హైప్ తగ్గిపోవడం వల్లే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపితేనే సినిమా భారీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉండి ఆయన చేత ఈ పాత్ర లో నటింపజేస్తున్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాడు అనేది… తొందర్లోనే సినిమాకు సంబంధించిన టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలను మరింత పెంచాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…