Balakrishna- Pawan Kalyan: ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా ప్లాట్ ఫారం లో సెన్సేషన్ సృష్టించిన షోస్ లో ఒకటి ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..ఆహా డిజిటల్ మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ టాక్ షో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..బాలయ్య బాబు లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి గురైయ్యారు..ఇక ఈ షో కి సంబంధించిన రెండవ సీసన్ మొదటి ఎపిసోడ్ ఈరోజు స్ట్రీమింగ్ అయ్యింది..ఈ ఎపిసోడ్ కి బాలయ్య బాబు గారి బావ మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు..ఆయనతో పాటుగా లోకేష్ కూడా పాల్గొన్నాడు..అయితే ఈసారి చివరి ఎపిసోడ్ కి ముఖ్య అతిధి గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అల్లు అరవింద్ గారు ఆహ్వానించాడు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి సీసన్ చివరి ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధి గా హాజరు అవ్వగా..ఈసారి చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడట అల్లు అరవింద్.

తొలుత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ,ఇప్పుడు ఆయన ఈ షో లో పాల్గొనడానికి నో చెప్పినట్టు తెలుస్తుంది..ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అందులో భాగంగానే ఈ షో కి రాలేకపోవచ్చునని అల్లు అరవింద్ కి తెలిపాడట పవన్ కళ్యాణ్..గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇలాంటి టాక్ షోస్ లో పాల్గొన్నది లేదు..అలాంటి వ్యక్తి ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో కి రావడానికి ఒప్పుకున్నారా అని అభిమానులు ఆశ్చర్యపోయారు..అయితే అల్లు అరవింద్ అసాద్యుడు..బాలయ్య బాబు ని వ్యాక్యతగా చూస్తాము అని మనం ఎప్పుడైనా అనుకున్నామా.

ఈరోజు జరిగింది గా..అలాగే ఇది కూడా జరుగుద్ది..అల్లు అరవింద్ తల్చుకుంటే కానీ పని అంటూ ఏది ఉండదు అని అందరూ అనుకున్నారు..కానీ చివరికి అల్లు అరవింద్ ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ విషయం లో ఫలించలేదు అని ఫిలిం నగర్ లో ఒక టాక్ చక్కర్లు కొడుతోంది..ఈ షో ద్వారా పవన్ కళ్యాణ్ – బాలకృష్ణ ని ఒకే ఫ్రేమ్ లో చూడాలి అనుకున్న అభిమానులకు చివరికి నిరాశే మిగిలింది.