
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారిన సంగతి తెల్సిందే. పవన్ కల్యాణ్ కు సంబంధించిన వరుస సినిమాల అప్డేట్స్ తరుచూ విన్పిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవర్ స్టార్ ఇప్పటికే ‘వకీల్ సాబ్’ను చివరిదశకు తీసుకొచ్చాడు. ఈ మూవీ సంక్రాంతి రేసులో నిలువడంతో అభిమానులు అత్రుతగా ఎదురు చూస్తున్నారు.
‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కల్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటించనున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడట. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ క్రిష్ తో ఓ చారిత్రక మూవీలో నటించనున్నాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవన్ కల్యాణ్ సినిమా పట్టాలెక్కనుంది.
పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ కల్యాణ్ ని ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారని డైరెక్టర్ గబ్బర్ సింగ్ ఇప్పటికే ప్రకటించాడు. అందుకు తగ్గట్టే సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ పవన్ కల్యాణ్ అండర్ వరల్డ్ డాన్ గా కన్పించనున్నాడట. పవర్ స్టార్ ఇప్పటి వరకు పూర్తి స్థాయి డాన్ క్యారెక్టర్లో నటించలేదు. ‘పంజా’ సినిమాలో పవన్ కల్యాణ్ డాన్ సహాయకుడిగా మాత్రమే నటించగా ఈ మూవీలో మాత్రం పూర్తిస్థాయి డాన్ గా కన్పించబోతున్నాడట. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ మూవీలో పవన్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందని సమాచారం.