Homeఎంటర్టైన్మెంట్Posani Krishna Murali: ‘పోసాని’ ‘లవ్ యూ రాజా’ ఊతపదం వెనుక కథేంటి?

Posani Krishna Murali: ‘పోసాని’ ‘లవ్ యూ రాజా’ ఊతపదం వెనుక కథేంటి?

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి పరిశ్రమలో సపరేట్ ఇమేజ్ కలిగి ఉన్నారు. రచయితగా, నటుడిగా ఆయన రాణించారు. పలు హిట్ చిత్రాలకు పోసాని రైటర్ గా పని చేశారు. స్టార్ డైలాగ్ రైటర్ అని చెప్పొచ్చు. పోసాని డైలాగ్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. సమాజంలో ఉన్న లోపాలను కొంచెం పచ్చిగా చెప్పే ప్రయత్నం చేసిన రైటర్ పోసాని. తాళి, పెళ్లి చేసుకుందాం చిత్రాల్లో పోసాని డైలాగ్స్ దిమ్మతిరిగేలా ఉంటాయి. పెళ్లి చేసుకుందాం మూవీలో క్యారెక్టర్ లేని ఆడవాళ్ళ మీద పోసాని సెటైర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ రోజుల్లో ఆ తరహా డైలాగ్స్ రాస్తే… స్త్రీ ఉద్యమాలు కూడా రావొచ్చు.

Posani Krishna Murali
Posani Krishna Murali

ఇక నటుడిగా ఆయన భిన్నమైన పాత్రలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన నటించిన మెంటల్ కృష్ణ న్యూఏజ్ ఫ్యామిలీ అండ్ సోషల్ డ్రామాగా నిలిచింది. నైటీ వేసుకొని పోసాని నటించడం ఒక సంచలనం. ఈ మూవీలో కూడా ఆడవాళ్ళపై సమాజంలో ఉన్న అపవాదులు వ్యంగ్యంగా విమర్శించే ప్రయత్నం చేశారు. పోసాని దర్శకుడిగా తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ఆపరేషన్ దుర్యోధన సూపర్ హిట్. ఆ సినిమాతో సమకాలీన రాజకీయాలను ఆయన ఏకిపారేశారు.

నటుడిగా బిజీ అయ్యాక పోసాని… రైటింగ్,డైరెక్షన్ పై ఫోకస్ తగ్గించేశారు. ఆయన సినిమాలన్నీ దాదాపు సోషల్ సెటైర్సే. ఆయన మార్క్ మూవీస్, డైలాగ్స్ మూవీ లవర్స్ బాగా మిస్ అవుతున్నారు. సినిమాలు సొంతగా నిర్మించి పోసాని ఆర్థికంగా నష్టపోయారు. ఒక దశలో ఇల్లు కూడా అమ్ముకున్నారు. ఆ దెబ్బతో డైరెక్షన్, నిర్మాణం వదిలేశారు. సేఫ్ గా నటుడిగా కొనసాగుతున్నారు.

Posani Krishna Murali
Posani Krishna Murali

ఆఫ్ స్క్రీన్ లో కూడా పోసాని మేనరిజం చాలా భిన్నంగా ఉంటుంది. మాట్లాడుతూ చొక్కా పైకి లాక్కోవడం ఆయన స్టైల్. అలాగే ‘ఐ లవ్ యూ’ రాజా అని ఆయన చెప్పే ఒక డైలాగ్ బాగా ఫేమస్. ఈ డైలాగ్ ఎలా పుట్టింది. దీని వెనుక నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రుత చాలా మందికి ఉంది. ఒక సందర్భంలో పోసాని ఈ విషయంపై స్పందించారు. గతంలో పోసాని పిల్లల డాన్స్ రియాలిటీ షో జడ్జిగా పాల్గొన్నారట. చిన్న పిల్లలు కాబట్టి బాగా చేసినా, చేయకున్నా వారిని ఎంకరేజ్ చేయాలి. సున్నితంగా చెప్పాలి. అలా ఒక పిల్లాడి పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతూ… ‘ఐ లవ్ యూ రాజా’ అని పోసాని అన్నారట. దానికి ప్రతిగా పిల్లాడు ‘థాంక్ యూ రాజా’ అన్నాడట. అప్పటి నుండి ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యిందట. సినిమాల్లో దర్శకులు నాకు ఆ డైలాగ్ పెడుతూ ఫేమస్ చేశారని చెప్పుకొచ్చాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version