https://oktelugu.com/

Rakul: రకుల్​-జాకీ రిలేషన్​ నిలబడదు.. పాపులర్​ జ్యోతిష్యుడు షాకింగ్​ కామెంట్స్​

Rakul: వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​లో హీరోయిన్​గా ప్రేక్షకులకు పరిచయమై తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్​సింగ్​. ఇటీవలే జాకీ భగ్నానితో రిలేషన్​లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, వీరిద్దరు పెళ్లి సన్నహాలు కూడా మొదలు పెట్టినట్లు సమాాచారం. అయితే, వీరిద్దరి బంధం ఎక్కువకాలం నిలవదని, త్వరలోనే విడిపోతారని పాపులర్​ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గతంలో నాగచైతన్య, సమంత- రూత్​ ప్రభు, అఖిల్​ అక్కినేని గురించి ఈయన చెప్పిన జోష్య నిజయం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 25, 2021 / 06:00 PM IST
    Follow us on

    Rakul: వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​లో హీరోయిన్​గా ప్రేక్షకులకు పరిచయమై తన అందం, అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్​సింగ్​. ఇటీవలే జాకీ భగ్నానితో రిలేషన్​లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, వీరిద్దరు పెళ్లి సన్నహాలు కూడా మొదలు పెట్టినట్లు సమాాచారం. అయితే, వీరిద్దరి బంధం ఎక్కువకాలం నిలవదని, త్వరలోనే విడిపోతారని పాపులర్​ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గతంలో నాగచైతన్య, సమంత- రూత్​ ప్రభు, అఖిల్​ అక్కినేని గురించి ఈయన చెప్పిన జోష్య నిజయం అయిన నేపథ్యంలో ఈ విషయంపై నెట్టింట చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే, జాకీ భగ్నానీ, రకుల్​ ప్రీత్​సింగ్​ సమస్యలను ఎదుర్కొంటారని, వీరి రాశుల్లో గ్రహాల స్థానాలు వివాహానికి అనుకూలంగా లేవని వేణుస్వామి వెల్లడించారు.

    అంతేకాకుండా, రకుల్​, జాకీ నిశ్చితార్థం రద్దవుతుందని, త్వరలోనే వీరి బంధం బ్రేకప్​తో ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ కాదని వివాహం చేసుకుంటే, వైవాహిక జీవితంలో తట్టుకోలేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. చట్టపరమైన సమస్యలతో రకుల్ జైలుకు వెళ్తుందని చెప్పి ఆమె అభిమానులకు షాక్​ ఇచ్చారు.  కాగా ఇటీవలే ‘కొండపొలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ‘ఓబులమ్మ’గా అలరించింది. క్రిష్​ జాగర్లపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో  వైష్ణవ్​ తేజ్​ హీరో. కొండపొలం నవల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి కాస్త ప్రేమ కథ జోడించి రసవత్తరంగా మలిచారు క్రిష్​. తొలుత ఈ సినిమాను సుకుమార్​, హరీశ్​ శంకర్​ తదితరులు తీయాలనుకున్నారు. చివరకు క్రిష్​ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.