Pavala Shyamala latest news: ఎన్నో వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యినటువంటి పావలా శ్యామల గత కొంతకాలం నుండి ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో ఉందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు నటిగా రోజుకు వేలరూపాయిలు సంపాదించే ఈమె , ఇప్పుడు కనీసం పూట గడవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఈమెకు మొదట్లో మన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం చేసి ఈమె సమస్యని అందరి దృష్టికి వచ్చేలా చేశారు. ఆ తర్వాత చిరంజీవి , రామ్ చరణ్ వంటి వారు కూడా ఆర్ధిక సాయం చేశారు. రీసెంట్ గా అల్లు అర్జున్ ఈమెకు నెలకు పది వేల రూపాయిలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చాడు. అయినప్పటికీ కూడా ఈమెకు కష్టాలు తీరలేదు.
రీసెంట్ గానే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె, చికిత్స కోసం కూకట్ పల్లి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. కానీ దురదృష్టం కొద్దీ ఆమె వద్ద డబ్బులు లేకపోవడం తో క్యాబ్ లో వెనక్కి పంపించేశారు. అర్థ రాత్రి ఆ క్యాబ్ డ్రైవర్ శ్యామల ని వైజంక్షన్ రోడ్డు పై వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో ఎటు వెళ్లాలో అర్థం అవ్వని శ్యామలా , ఫుట్ పాత్ పై కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. పాపులర్ నటి కాబట్టి , అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఆమెని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఆర్కీ ఫౌండేషన్ కి తరలించారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో , సీరియల్స్ లో నటించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న పావలా శ్యామలా పరిస్థితి ఇంతటి దయనీయంగా మారడం అందరూ శోచించాల్సిన విషయం. ఆమె పరిస్థితి పై సినీ ప్రముఖులు మరోసారి స్పందించి సహాయం చేస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఒక పాపులర్ నటి ఇంత ఇబ్బందులు పడుతుంటే, మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ ఏమి చేస్తుంది?, మనకి తెలిసి కేవలం పావలా శ్యామల ఒక్కటే ఉంది , కానీ ఇలాంటి నటీనటులు ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉండే ఉంటారు, వీళ్లందరి కోసం ఒక ఫౌండేషన్ లాంటిది నడుపుతూ , ఆశ్రయం ఎందుకు కలిపించడం లేదు?, ఇలాంటి మంచి పనులకు ఉపయోగపడని మా అస్సోసియేషన్ ఎందుకు ?, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒకవేళ ఇలాంటి వాళ్ళను చేరదీసి , వాళ్ళ బాగోగులు చూసుకునే కార్యక్రమం తలపెడితే చిరంజీవి , బాలకృష్ణ లాంటి వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ఇస్తారు కదా?, ఎందుకు ఆ విధంగా ఆలోచన చేయడం లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ విమర్శిస్తున్నారు.
నటి పావలా శ్యామల పరిస్థితి విషమం..
గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పావలా శ్యామల,
నిన్ను రాత్రి చికిత్స నిమిత్తం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన శ్యామల.
చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో, ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించిన క్యాబ్ బుక్ చేసి వెనక్కి పంపేసిన… pic.twitter.com/AwGcuKF9Lc
— NTV Breaking News (@NTVJustIn) May 16, 2026
