Poonam Pandey: బూతుల రాణి పూనమ్ పాండే గురించి ఎంత అని చెప్పాలి ? ఏమి అని చెప్పాలి ? ఆమె బోల్డ్ లోకంలో తిరుగులేని మహారాణి. అయితే, ఆ మహారాణికి గతేడాది పెళ్లి అయింది. ఆమె భర్త పేరు సామ్ బాంబే. అతగాడు ఎంత ధీరుడు అంటే.. పెళ్లి అయిన మూడో రోజే ఈ బోల్డ్ ప్రపంచపు యువ రాణిని పిచ్చకొట్టుడు కొట్టాడు.

తనను దారుణంగా కొడతాడా ? అంటూ కసితో రగిలిపోయి.. పూనమ్ అతన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించింది. మొత్తానికి పెళ్లి అయి నాలుగు రోజులు కూడా గడవక ముందే అతని నుంచి పూనమ్ పాండే విడిపోయింది. ఇక అప్పటి నుంచి విడిగా ఉంటుంది. అయితే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్యామ్ బాంబేపై బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: సుడిగాలి సుధీర్ కోసం నలుగురు అమ్మాయిల మధ్య పోటీ
శ్యామ్‌తో కలిసి ఉన్నప్పుడు తనకు నరకంలా అనిపించింది అని తెలిపింది. కంగనా హోస్ట్ గా నిర్వహిస్తున్న లాకప్ షోలో మాట్లాడుతూ.. ‘తనను రోజూ తిట్టి, కుక్కను కొట్టినట్లు కొట్టి రూమ్‌లో బంధించేవాడని చెప్పింది. తినడానికి వడాపావ్ దొరికితే చాలు అనుకునే దాన్నని పూనమ్ పాండే ఎమోషనల్ అవుతూ చెప్పింది.

ఆ సమయంలో చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని కూడా పూనమ్ చెప్పింది. ఇక పూనమ్ త్వరలోనే ఒక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏది ఏమైనా పూనమ్ పాండే నటించిన సినిమాలు తక్కువ అయినా, అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా పూనమ్ సోషల్ మీడియాలో చేసే ‘అంగాంగ ప్రదర్శన’కు విశేష అభిమానులు ఉన్నారు.