Pooja Hegde-Sreeleela: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. పెళ్ళిసందడి చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమైన ఈమె తొలిసినిమా తోనే ఎవరీ ఈ అమ్మాయి, చిచ్చర పిడుగులాగా ఉంది అని అందరూ అనుకున్నారు.
ఆ తర్వాత ఆమె రవితేజ తో చేసిన ధమాకా చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ సినిమా ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధానకారణాలలో ఒకటిగా శ్రీలీల డ్యాన్స్ నిలవడం,ఇలాంటివన్నీ గమనించిన తర్వాత దర్శక నిర్మాతలు ఈమెని తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకునేందుకు క్యూలు కట్టేస్తారు. దాంతో అప్పటి వరకు మోస్ట్ డిమాండ్ ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే కెరీర్ ఒక్కసారిగా రిస్క్ లో పడింది. ఒకప్పుడు పూజ హెగ్డే డేట్స్ కోసం ఎగబడిన దర్శక నిర్మాతలు, ఇప్పుడు యూ టర్న్ తీసుకొని శ్రీలీల వైపు వెళ్తున్నారు.
రీసెంట్ గా శ్రీలీల వల్ల పూజ హెగ్డే కి చాలా తీవ్రమైన నష్టాలే జరుగుతున్నాయి. అసలు విషయానికి వస్తే మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రం లో ముందుగా మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మహేష్ కి స్క్రిప్ట్ సరిగా నచ్చకపోవడం తో మార్పులు చేస్తూ వచ్చారు.అలా ఇప్పుడు ;పూర్తి స్క్రిప్ట్ ని మార్చేశారు,నేటి నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. మార్పులు చేసిన స్క్రిప్ట్ ప్రకారం శ్రీలీల ని మెయిన్ హీరోయిన్ గా చేసి, పూజ హెగ్డే ని సెకండ్ హీరోయిన్ గా చేశారట. దీనికి ఆమె అవమానం గా ఫీల్ అయ్యి ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట.
అలాగే పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో కూడా ఇదే పరిస్థితి, ఈ సినిమాలో శ్రీలీల ఉన్న కారణంగా ఆమె మీద ఈగో తో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట, అలా కేవలం తనకంటే జూనియర్ గా వచ్చిన శ్రీలీల ఎదుగుదల ని ఓర్వలేక ఆమె ఉన్న సినిమాల్లో కో హీరోయిన్ గా నటించేందుకు ఇష్టపడడం లేదట పూజ హెగ్డే. అసలే అవకాశాలు తగ్గుతున్న సమయం లో ఇలాంటి పిచ్చి పనులు చెయ్యడం వల్ల ఆమె రేంజ్ ఇంకా పడిపోయే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు.