Mahesh – Trivikram : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ సినిమా.. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అతడు’ , ‘ఖలేజా’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ..టీవీ టెలికాస్ట్ లో అద్భుతమైన TRP రేటింగ్స్ ని సాధించి అభిమానులకు.. ప్రేక్షకులకు మోస్ట్ లవబుల్ మూవీస్ గా నిలిచాయి..అలాంటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం, పైగా మహేష్ – త్రివిక్రమ్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉండడం వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మొదటి నుండి ట్రేడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేని ఎంచుకున్నాడు త్రివిక్రమ్.. ఆమెని హీరోయిన్ గా పెట్టుకొని తీసిన త్రివిక్రమ్ చివరి రెండు సినిమాలు ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠపురంలో’ చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి..కాబట్టి ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూనే పూజ హెగ్గేని ఈ చిత్రం లో కూడా హీరోయిన్ గా తీసుకున్నాడు త్రివిక్రమ్.
మొన్నీమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా ఒక చిన్న షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది..ఇక ఆ తర్వాత మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూయడంతో కొద్దీ రోజులు రెండవ షెడ్యూల్ ని వాయిదా వేశారు..ఇప్పుడు మహేష్ బాబు రెండో షెడ్యూల్ లో పాల్గొనడానికి సిద్ధం.. కానీ హీరోయిన్ పూజ హెగ్డే మాత్రం సిద్ధంగా లేదు..ఇటీవలే ఒక ఫంక్షన్ లో పాల్గొన్న ఆమె తన కాళ్ళని విరగొట్టుకుకుంది.
ప్రస్తుతం చికిత్స నిమిత్తం రెస్ట్ మోడ్ లో ఉన్న పూజ హెగ్డే ఇంకా కోలుకోలేదు..రెండు వారాల రెస్ట్ తర్వాత స్కాన్ తీసుకున్నాక డాక్టర్లు మరో నెల రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పే అవకాశాలు ఉన్నాయట..అదే కనుక జరిగితే మహేష్ – త్రివిక్రమ్ మూవీ రెండో షెడ్యూల్ డిసెంబర్ లో కూడా ప్రారంభం అయ్యే అవకాశం లేదు.
ఎందుకంటే పూజ హెగ్డే చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి..అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రం కూడా ఒకటి ఉంది.. కాబట్టి డేట్స్ సమస్య తలెత్తే అవకాశం ఉంది..దీంతో పూజ హెగ్డే ని తప్పించమని మహేష్ బాబు త్రివిక్రమ్ తో అన్నాడట..డిసెంబర్ లో డేట్స్ కేటాయించకపోతే త్రివిక్రమ్ కి కూడా వేరే ఆప్షన్ లేకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని మహేష్ కి జోడిగా పెట్టె ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
