Pooja Hegde : స్టార్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సౌత్ నుండి నార్త్ కి వెళ్లిన హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే(Pooja Hegde). కానీ ఇప్పుడు ఆమెకు ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ ఎదురు అవుతున్నాయో మన కళ్లారా చూస్తున్నాము. హిందీ లో ఈమె స్టార్ హీరోలతోనే సినిమాలు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా ఈమె తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ విడుదలకు ముందు ఈ చిత్రం పై అంతటి భారీ అంచనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం పూజా హెగ్డే. కన్నిమ్మ అనే పాటకు ఆమె వేసిన స్టెప్పులే హైప్ రావడానికి కారణం అయ్యింది.
Also Read : ఒకప్పుడు బార్బర్ గా పనిచేసిన ఈ పాన్ ఇండియా స్టార్ నటుడు ఎవరో తెలుసా…
కానీ పాపం బ్యాడ్ లక్ ఆమెని అలా వెంటాడుతుంది. అయితే ఫ్లాప్స్ లో ఉన్న హీరోయిన్స్ ఒక్కోసారి ఐటెం సాంగ్స్ చేసి మళ్ళీ యూత్ ఆడియన్స్ కి చేరువ అవుతుంటారు. అందుకు లేటెస్ట్ ఉదాహరణ కేతిక శర్మ అనొచ్చు. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా ఏళ్ళు అవుతున్నప్పటికీ, ఈమెకు మొన్న విడుదలైన ‘సింగిల్’ వరకు సూపర్ హిట్ లేదు. అంతకు ముందు ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితే ‘రాబిన్ హుడ్’ చిత్రం లో ‘అది దా సర్ప్రైజ్’ అనే ఐటెం సాంగ్ చేసి ఈ అమ్మాయి సెన్సేషన్ సృష్టించేసింది. యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయింది. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఆ రూట్ లోనే వెళ్లే ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఈమె సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ'(Coolie Movie) చిత్రం లో ఐటెం సాంగ్ చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా మేకర్స్ విడుదల చేశారు.
ఇప్పుడు ఆమె రామ్ చరణ్(Global Star Ram Charan), బుచ్చి బాబు(Buchi Babu Sana) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం లో కూడా ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం ఆమె మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నట్టు సమాచారం. చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో పూర్తి స్థాయి రోల్స్ చేసి కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోవడం లేదు. అలాంటిది పూజా హెగ్డే కేవలం ఐటెం సాంగ్ కి అందుకుందంటే ఆమె రేంజ్ ఫ్లాప్స్ కారణంగా ఇసుమంత కూడా తగ్గలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతం లో పూజా హెగ్డే రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రం లో ‘జిల్..జిల్..జిగేలు రాణి’ అనే ఐటెం సాంగ్ చేసింది. అప్పట్లో ఈ పాట ఇండస్ట్రీ ని షేక్ చేసింది. ఈ పాటకు ముందు పూజా హెగ్డే చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, ఈ పాట తర్వాత చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఆమెకు అదే సెంటిమెంట్ కలిసి వస్తుందో లేదో చూడాలి.