బేరాలు ఆడే వారికి ‘పూజా హెగ్డే’ దూరం !

టాల్ బ్యూటీ ‘పూజా హెగ్డే’ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోయిన్ కాబట్టి, ఆమె డేట్లు కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూడాల్సి వస్తోంది. అందుకే పూజా డేట్స్ కోసం రెండు నెలలు ముందుగానే నిర్మాతలు ఎగబడుతున్నారని… అయినప్పటికీ, పూజా డేట్లు మాత్రం అందుబాటులో ఉండటం లేదని.. ఇలా అయితే, అనుకున్న టైంకు తమ సినిమా పూర్తి అవ్వదు అని, అలాగే షూటింగ్ ను కూడా పోస్ట్ ఫోన్ చేయలేము అని నిర్మాతలు టెన్షన్ […]

Written By: admin, Updated On : July 17, 2021 4:28 pm
Follow us on

టాల్ బ్యూటీ ‘పూజా హెగ్డే’ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోయిన్ కాబట్టి, ఆమె డేట్లు కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూడాల్సి వస్తోంది. అందుకే పూజా డేట్స్ కోసం రెండు నెలలు ముందుగానే నిర్మాతలు ఎగబడుతున్నారని… అయినప్పటికీ, పూజా డేట్లు మాత్రం అందుబాటులో ఉండటం లేదని.. ఇలా అయితే, అనుకున్న టైంకు తమ సినిమా పూర్తి అవ్వదు అని, అలాగే షూటింగ్ ను కూడా పోస్ట్ ఫోన్ చేయలేము అని నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

ఇది ఇలా ఉంటే.. తానూ ఏ నిర్మాతలకు అయితే డేట్లు ఇచ్చిందో.. ఆ నిర్మాతలు మాత్రం రెమ్యునరేషన్ లో డిస్కౌంట్లు అడుగుతూ టైమ్ పాస్ చేస్తున్నారట. దీంతో తన డేట్లు కొన్ని వేస్ట్ అవుతున్నాయని ఫీల్ అవుతుంది ‘పూజా హెగ్డే’. నిజానికి ఈ టాల్ బ్యూటీ తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి అమాంతం రెమ్యునరేషన్ ను పెంచింది.

మరోపక్క కరోనా మహమ్మారితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నిర్మాతలు మాత్రం సినిమాలు పూర్తి చేయడానికి చాల కష్టపడుతున్నారట. అందుకే నటీనటులను రెమ్యునరేషన్ ను తగ్గించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐతే, స్టార్ హీరోలతో రెమ్యునరేషన్ ను తగ్గించుకోమని ఏ నిర్మాత కోరడం లేదని, కేవలం హీరోయిన్ల విషయంలో మాత్రమే, వాళ్ళు బేరాలు ఆడుతూ హీరోయిన్లకు తగ్గించి ఇస్తున్నారని పూజా సీరియస్ గా ఉందట.

హీరోలకు ఎగబడి రేట్లు పెంచే నిర్మాతలు, మా హీరోయిన్ల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఇవ్వడానికి తెగ ఇదైపోతారని.. ఇది చాలా బాధను కలిగిస్తోందని, అందుకే ఇక నుండి ఈ బేరాలు చేసే నిర్మాతలతో ఇక మీదట వర్క్ చేసేది లేదని పూజా తన మేనేజర్ కి క్లారిటీ ఇచ్చింది. అయితే బేరాలు ఆడే నిర్మాతల్లో ఓ బడా నిర్మాత కూడా ఉన్నాడు. మరి పూజా ఆ నిర్మాతను కూడా దూరం పెడుతుందా ?