Pooja Hegde : మొదటి సినిమాతోనే యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే(Pooja Hegde). ఈమె అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, నటిగా పూజ హెగ్డే కి మంచి మార్కులు పడ్డాయి. అలా ఇండస్ట్రీ లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి పని చేసిన పూజా హెగ్డే ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని నిర్మాతల పాలిట లక్కీ హీరోయిన్ గా మారింది. కానీ ‘అలా వైకుంఠపురంలో’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈమె జాతకం తలక్రిందులు అయ్యింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి.
Also Read : హీరోయిన్ శ్రీదేవి బయోపిక్ లో పూజ హెగ్డే..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్!
ఈ చిత్రం తర్వాత ఆమె అక్కినేని అఖిల్ తో కలిసి చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత ఈమె చేసిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కేసీ కా భాయ్..కేసి కా జాన్, దేవా వంటి చిత్రాలు ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన ‘రెట్రో'(Retro Movie) చిత్రం పై ఆశలు భారీగానే పెట్టుకుంది. ఈ సినిమాకు అంత హైప్ ఏర్పడడానికి ఒక విధంగా పూజా హెగ్డే చేసిన ప్రొమోషన్స్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఎంతో శ్రద్ద చూపించి మరీ ఆమె ప్రొమోషన్స్ చేసింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా, లేదా డిజాస్టర్ అవుతుందా అనేది ఈరోజు, రేపు వచ్చే కలెక్షన్స్ మీద ఆధారపడుంది.
కానీ కమర్షియల్ ఫెయిల్యూర్ గా ‘రెట్రో’ చిత్రం నిలబడడం మాత్రం పక్కా అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇలా పాపం ఈ హీరోయిన్ ముట్టుకున్న ప్రతీ సినిమా డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు రావడం ఆగిపోలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ చిత్రం ఆగష్టు 14న విడుదల కాబోతుంది. అదే విధంగా హిందీ లో వరుణ్ ధావన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న పూజా హెగ్డే, తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి ‘జన నాయగన్’ అనే చిత్రం చేస్తుంది. అదే విధంగా రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ లో కూడా ఈమె నటించబోతుంది. ఇవి కాకుండా రెండు తెలుగు సినిమాలకు కూడా ఆమె సంతకం చేసిందట. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.
Also Read : మమ్మల్ని డైరెక్టర్స్ ఆ విషయంలో తొక్కేస్తున్నారు : పూజా హెగ్డే