https://oktelugu.com/

Actor Naga Shourya: యంగ్ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్…

Actor Naga Shourya: హైదరాబాద్‌ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడులు జరిపారు. ఇందులో భాగంగా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సుమారు 20 మంది ప్రముఖులు వీరిలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో ఉన్న మంచిరేవుల వ‌ద్ద నాగశౌర్య కు ఒక విల్లా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 1, 2021 10:41 am
    Follow us on

    Actor Naga Shourya: హైదరాబాద్‌ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడులు జరిపారు. ఇందులో భాగంగా పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సుమారు 20 మంది ప్రముఖులు వీరిలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలో ఉన్న మంచిరేవుల వ‌ద్ద నాగశౌర్య కు ఒక విల్లా ఉంది. సుమ‌న్ అనే వ్య‌క్తి పుట్టిన‌రోజు ఫంక్ష‌న్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని పేకాట స్థావ‌రం గా మార్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు దాడి చేసిన స‌మ‌యంలో ప్రధాన నింధితుడు సుమ‌న్ ప‌రారయ్యాడు. దాంతో పేకాట ఆడుతున్న ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    police rides on naga shourya farm house and arrested rummy players

    ఈ దాడుల్లో ల‌క్ష‌ల్లో న‌గ‌దు, మొబైల్ ఫోన్లు, కార్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌ధాన నింధితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ విల్లాను నాగ‌శౌర్య నుంచి ఆరు నెల‌ల కోసం అద్దెకు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక త‌న ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్న విష‌యం నాగ‌శౌర్య‌కు తెలుసా లేదా అనే విషయం ఇప్పుడు ప్రశ్నర్దకంగా మారింది.

    ఇటీవలే నాగశౌర్య, పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ  జంటగా నటించిన చిత్రం “వరుడు కావలెను” . ఈ సినిమా అక్టోబర్ 29 న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించగా… సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్ర శేఖర్ అందించారు.