Mirai Piracy Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే తేజ సజ్జ లాంటి నటులు సైతం ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన మిరాయి సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా అందరు చేత శభాష్ అనిపించుకునేలా ఉంది. మరి ఈ సినిమా ని ఈ వీకెండ్ లో చాలామంది ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తారు అంటూ సినిమా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ఎవ్వరైనా సరే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు అనే రేంజ్ లో ఈ సినిమా ఉండడం వల్ల ఈ మూవీ ని చూడ్డానికి జనాలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన హెచ్ డి ప్రింట్ ఆన్లైన్లో అవలేబుల్ లో ఉంది.
దీనివల్ల చాలామంది ప్రేక్షకులు ఈ సినిమాను చూసి థియేటర్ కి వచ్చి సినిమాను చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. దానివల్ల సినిమా కలెక్షన్స్ తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది మిరాయి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే భారీ కలెక్షన్స్ కి కొల్లగొట్టాల్సిన అవసరమైతే ఉంది.
కాబట్టి ఈ విషయం మీద సినిమా మేకర్స్ సైబర్ క్రైమ్ వాళ్లకి రిపోర్ట్ చేసి ఆన్లైన్ నుంచి ఆ పైరసీ ప్రింటింగ్ తొలగించే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు అలా అయితేనే ఈ సినిమాకి సూపర్ సక్సెస్ టాక్ వచ్చినట్టుగా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తాయి. లేకపోతే మాత్రం సినిమా కలెక్షన్స్ డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయని వాళ్ళు తెలియజేస్తూ ఉండడం విశేషం…
మొత్తానికైతే సినిమా మేకర్స్ దీనిమీద స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కానీ ఏది ఏమైనా కూడా పైరసీ ని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు… ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఒక్క రోజు లోపే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ గా రావడం అనేది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి భారీ దెబ్బగా మారింది. మరి దీని మీద కట్టడి చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికి అది సఫలం కావడం లేదు…