Klin Kaara Konidela: మెగా వారసురాలి ఫస్ట్ లుక్.. చరణ్ కూతురు క్లింకారను చూశారా

నిజానికి ఈ చిన్నారిని మీడియాకు దూరంగా పెంచాలని అనుకున్నప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు క్లింకార ను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారు. తాజాగా ఆగస్టు 15 న క్లీంకార కు సంబంధించిన ఫోటోలు స్వయంగా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.

Written By: Shiva, Updated On : August 16, 2023 1:27 pm

Klin Kaara Konidela

Follow us on

Klin Kaara Konidela: మెగా ఫ్యామిలీ కి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదగడం, మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాల్తేరు వీరయ్య లాంటి సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకోవడం జరిగాయి. ఇది మాత్రమే కాకుండా మెగా ఇంట్లోకి మహాలక్ష్మి కూడా వచ్చేసింది. రామ్ చరణ్ – ఉపాసన లకు పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జూన్ 20 న పండండి పాప పుట్టింది.

దీనితో మెగా ఇంట్లోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. ఆ సమయంలో తెలుగు యావత్తు మీడియా కూడా మెగా ప్రిన్సెస్ గురించే మాట్లాడటం జరిగింది. ఈ విధమైన పబ్లిసిటీ ఏ స్టార్ కిడ్ కు రాలేదనే చెప్పాలి. ఆ సమయంలో మెగా ప్రిన్సెస్ టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అయ్యిందనే చెప్పాలి. ఆ పాపకు క్లీంకార అని నామకరణం చేశారు. అమ్మవారి అంశగా భావిస్తున్న ఆ చిన్నారికి అమ్మవారి నామాల్లో ఒకటైన ‘ క్లింకార ‘ ను పేరుగా పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి మీడియా కు చెప్పి మురిసిపోయాడు.

నిజానికి ఈ చిన్నారిని మీడియాకు దూరంగా పెంచాలని అనుకున్నప్పటికీ కూడా మెగా ఫ్యాన్స్ కోరిక మేరకు క్లింకార ను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారు. తాజాగా ఆగస్టు 15 న క్లీంకార కు సంబంధించిన ఫోటోలు స్వయంగా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ప్రస్తుతం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న క్లింకార ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వేడుకలను తాతయ్య, అమ్మమ్మ లతో కలిసి చేసుకుంది.

జెండా తాడు ను పట్టుకుని ఉన్న క్లింకార ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. మెగా ప్రిన్సెస్ ఫోటోలు బయటకు వచ్చేసరికి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. క్లింకార ఫోటోలు విడుదల చేసినందుకు మెగా కోడలు ఉపాసన కు ఫ్యాన్స్ ధన్యవాదాలు చెపుతున్నారు. పాప పుట్టిన సమయంలో ఉపాసనకు తోడుగా ఉండాలని భావించి రామ్ చరణ్ దాదాపు 3 నెలలు ఎలాంటి షూటింగ్స్ లేకుండా తన భార్యకు తోడుగా ఉన్నాడు. రీసెంట్ గా తను చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో రీ జాయిన్ అయ్యారు.