Peddi Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ లాంటి నటుడు సైతం ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎలాంటి రికార్డులనైతే క్రియేట్ చేశాడో ఆయనకు మించిన రికార్డులను క్రియేట్ చేస్తూ రామ్ చరణ్ (Ram Charan) ముందుకు దూసుకెళ్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన బూచి బాబు డైరెక్షన్ లో ‘ పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఊర్లలో గల్లి క్రికెట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా కథను రాశారు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి గుర్తింపు సంపాదిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడిటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఈ సినిమాలో మీర్జాపూర్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటి ని సంపాదించుకున్న మున్నాభాయ్ (దివ్యేందు శర్మ) ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి రాంచరణ్ మున్నాభాయ్ ల మధ్య ఒక భారీ సమరమే జరగబోతోంది. వీళ్లిద్దరి పోరాటంలో ఎవరు గెలుస్తారు అనేదే అక్కడ సస్పెన్స్ గా మారనుంది.ఇక రామ్ చరణ్ లాంటి మంచి నటుడు దివ్యేందు శర్మ ను డీ కొడుతూ మరోసారి తన నటన ప్రతిభ ను చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక మున్నాభాయ్ ఇంత రియలెస్టిక్ నటిస్తాడో మనందరికీ తెలిసిందే. మిర్జాపూర్ సిరీస్ లో నటించినందుకు గాను అతనికి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఆయన మాట్లాడే మాటలకి విశేషమైన స్పందన అయితే లభించింది.
ఈ సినిమాలో నటించడం ద్వారా ఆయనకి ఎలాంటి ఐడెంటిటి దక్కుతోంది. తద్వారా రామ్ చరణ్ కు ఒక భారీ జలక్ ఇస్తూ ఆయన ఈ సినిమాలో క్రికెట్ ఆడబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో ఎవరు ఎలాంటి ఐడెంటిటి ని సంపాదించుకుంటారు అనేది…