Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Rejected Star Heroes: పెద్ది మూవీ ని రిజెక్ట్ చేసి ఆ ఇద్దరు...

Peddi Movie Rejected Star Heroes: పెద్ది మూవీ ని రిజెక్ట్ చేసి ఆ ఇద్దరు స్టార్ హీరోలు సేఫ్ అయ్యారా..?

Peddi Movie Rejected Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు రిలీజ్ అయి చాలా రోజులు అవుతుంది. ఇక ఇపంటో క్రమంలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన ‘పెద్ది’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా ఈ సినిమాకు మొదటి నుంచి కూడా భారీ హైప్ ఉండడం వల్ల ఈ సినిమాని ప్రీమియర్ షోస్ చూడడానికే చాలామంది ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనే ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులందరు ఈ సినిమాని చూడాల వద్ద అనే ఒక డైలమాలో పడిపోయారనే చెప్పాలి. అయితే ఈ సినిమాని రామ్ చరణ్ కంటే ముందే ఒక ఇద్దరు హీరోలకైతే చెప్పారట. కానీ ఆ హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఎట్టకేలకు రామ్ చరణ్ దగ్గరికి వచ్చింది. ఇక సుకుమార్ సహాయంతో రామ్ చరణ్ కి కథను వినిపించిన బుచ్చిబాబు సింగల్ సిటింగ్ లోనే కథను ఓకే చేయించుకున్నాడు.

సుకుమార్ ఉన్నాడనే ధైర్యంతో రామ్ చరణ్ సైతం బుచ్చిబాబ కిు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే మొదట బుచ్చిబాబు ఈ కథను ఎవరికి వినిపించాడు. వాళ్లు ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయంలోనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తితో నెలకొంది.

అయితే ఈ సినిమా కథని మొదట బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. ఎన్టీఆర్ ఈ కథ విషయంలో కొన్ని సందేహాలను వ్యక్తం చేశారట. కొన్ని మార్పులు చేర్పులు చేయమని కూడా చెప్పారట.అయినప్పటికి బుచ్చిబాబు వినకపోవడంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ తర్వాత ఈ కథని తమిళ్ స్టార్ హీరో సూర్యకి వినిపించారు.

సూర్య సైతం ఈ కథ విషయంలో అంత సాటిస్ఫై అవ్వకపోవడంతో అతను ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఎట్టకేలకు రామ్ చరణ్ వద్ద కైతే వచ్చింది. ఈ సినిమాని చూసిన కొంత మంది ప్రేక్షకులు ఎన్టీఆర్, సూర్య ఈ సినిమా చేయకపోవడమే మంచిదయింది అంటూ వాళ్ళు ఈ సినిమా నుంచి తప్పించుకున్నారు అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular