Peddi First Half Final Edit: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) అభిమానులు, మెగా అభిమానులు మొత్తం ఇప్పుడు ‘పెద్ది'(Peddi Movie) చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా తో మెగా ఫ్యామిలీ నుండి వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాని ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీ లో రిజిస్టర్ చేయాలనీ బలమైన కసితో ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకు అంతటి సత్తా ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో, చికిరి చికిరి సాంగ్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాటకు అయితే యూట్యూబ్ లో ఇప్పటి వరకు అన్ని భాషలకు కలిపి 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కేవలం ఇండియన్స్ మాత్రమే ఈ పాటని ఆదరించలేదు, ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ పాటని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి రీచ్ ఒక సినిమా కంటెంట్ రావడం అనేది నిజంగా అదృష్టం అనే చెప్పాలి.
కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, ఈ చిత్రానికి అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ రావడం తో, మెగా ఫ్యాన్స్ కచ్చితంగా ఈ చిత్రానికి వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉందని బలంగా నమ్ముతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ని ఎడిటింగ్ తో సహా డైరెక్టర్ బుచ్చి బాబు లాక్ చేసాడట. రీ రికార్డింగ్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ కోసం ఆ ఎడిట్ ని సంగీత దర్శకుడు AR రెహమాన్ కి పంపినట్టు సమాచారం. ఈ వారం లోనే AR రెహమాన్ ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ ని మొదలు పెట్టబోతున్నాడట. ఇదంతా పక్కన పెడితే, ఈ సినిమాని ముందు అనుకున్నట్టుగా మార్చి 27 న విడుదల చేయడం దాదాపుగా అసాధ్యమే అని మరోసారి ఖరారు అయ్యింది.
ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ లోని ఒక భారీ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉందట. ఈ షూటింగ్ కోసం రామ్ చరణ్ తన శరీరాన్ని కూడా మార్చుకున్నాడు. రీసెంట్ గానే ఆయన మేక్ ఓవర్ కి సంబంధించిన లుక్ ని ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం, అది బాగా వైరల్ అవ్వడం జరిగింది. ఈ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా నెల రోజుల వరకు ఉంటుందట. ఆ తర్వాత కూడా కొన్ని కీలకమైన ప్యాచ్ వర్క్స్ ఉంటాయట. షూటింగ్ మొత్తం పూర్తి అవ్వడానికి మార్చి రెండవ వారం వరకు సమయం పట్టేలా అందని అంటున్నారు. సెకండ్ హాఫ్ ని లాక్ చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా సమయం పెట్టె అవకాశం ఉంది కాబట్టి, మార్చి 27 న ఈ చిత్రం విడుదల అవ్వడం అసాధ్యమే. మే1న ‘మేడే’ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.