Peddi 2 days worldwide collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది ‘ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెండవ రోజు 36 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రెండవ రోజున దాటాయి , ఇప్పుడు ఆరవ చిత్రంగా ‘పెద్ది’ చిత్రం నిల్చింది.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ , సీడెడ్ ప్రాంతాల్లో ఈ చిత్రం దంచిన దంచుడు మామూలు రేంజ్ కాదనే చెప్పాలి. కానీ నైజాం ప్రాంతం లో రెండవ రోజు యావరేజ్ పెర్ఫార్మన్స్ ని సొంతం చేసుకోగా, ఓవర్సీస్ లో డిజాస్టర్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రేటింగ్స్, టాక్ అన్నీ బాగున్నప్పటికీ కూడా ఓవర్సీస్ లో ఎందుకు ఇంత తక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయో, విశ్లేషకులకు కూడా అంతు చిక్కని ప్రశ్న. ఇక రెండవ రోజున ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి , రెండు రోజులకు కలిపి ఎంత షేర్ , ఎంత గ్రాస్ వచ్చింది , ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది వివరంగా ఇప్పుడు చూద్దాం. ముందుగా నైజాం ప్రాంతం విషయానికి వస్తే 2 వ రోజున ఈ చిత్రానికి ఇక్కడ రిటర్న్ జీఎస్టీ తో కలిపి 6 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి .
ఓవరాల్ గా 2 రోజులకు కలిపి నైజాం ప్రాంతం నుండి 24 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. అదే విధంగా సీడెడ్ నుండి 2 వ రోజున 2 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండు రోజులకు కలిపి 9 కోట్ల 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 2 రోజుల్లో 9 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్ల 51 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 4 కోట్ల 70 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 7 కోట్ల 57 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 4 కోట్ల 89 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
మొత్తం మీద రెండు రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 70 కోట్ల 61 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 99 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 6 కోట్ల 55 లక్షలు , తమిళనాడు + కేరళ నుండి 95 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల 80 లక్షలు , ఓవర్సీస్ నుండి 15 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల 56 లక్షలు, 155 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఈ చిత్రానికి ఇంకా 122 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాల్సి ఉంది. 10 రోజుల్లో ఈ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ఫ్యాన్స్.
