
బిగ్ బాస్.. ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షో తెలుగులోనూ బిగ్ హిట్ అయ్యింది. ఎంతో పాపులర్ అయ్యింది. అత్యంత ప్రజాదరణ గల షోగా పేరుపొందింది. అయితే కరోనా లాక్ డౌన్ తో ఈసారి క్వారంటైన్ లో ఉండి బిగ్ బాస్ లో పాల్గొనడానికి చాలా మంది మొహం చాటేస్తున్నారట.. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది.
“బిగ్ బాస్ తెలుగు” సీజన్ 5 త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్ కోసం పాల్గొనేవారి గురించి మీడియా.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. చాలా మంది ఈ వార్తలపై స్పందించడం లేదు. కొంత మంది స్పందిస్తున్నారు.
గ్లామర్, రోమాంటిక్ ఇమేజ్‌కి పేరుగాంచిన ఆర్ఎక్స్100 మూవీ మీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు బిగ్ బాస్ 5 సీజన్ లో పాల్గొనబోతోందని.. ప్రముఖమైన టాలీవుడ్ పేర్లలో ఈమె ఒకరని ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై తాజాగా పాయల్ స్పందించింది. రియాలిటీ షోలో తాను పాల్గొనబోనని స్పష్టం చేసింది.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. “నేను బిగ్ బాస్ 5 తెలుగులో పాల్గొనడం లేదు. ఇది ఒక నకిలీ వార్త… ఇది ఒక వినయపూర్వకమైన అభ్యర్థన. ఇటువంటి పుకార్లలోకి నన్ను లాగవద్దు!” అని స్పష్టం చేసింది. పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ఒక పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నారనే పుకార్లను కూడా కొట్టిపారేశారు.