Varun Tej Lavanya Marriage: మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా సాగింది. ఇటలీలో ఈ వేడుకను నిర్వహించిన భారత సాంప్రదాయ పద్దతుల్లోనే అన్నీ కార్యక్రమాలు చేశారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు మరికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుకకు ముందు జరిగిన కాక్ టెయిల్, హల్దీ వేడుకల్లో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో సందడి చేశారు. ఈ ఈవెంట్ లో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తరువాత ఎంతో మంది ఎంట్రీ ఇచ్చారు. ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్, కుమారుడు రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైశవ్ తేజ్ లు ఈ ఈవెంట్ లో కనిపించారు. వీరంతా ఒకే ఫ్రేమ్ లో కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా మెగా హీరో రామ్ చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ తో ఓ పిక్ లో సందడి చేశారు. వీరిద్దరు వర్క్ బిజీలో చాలా సందర్భంగా కలుసుకోరు. దీంతో ఈ ఇద్దరు కలిసి దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.

కొత్త జంటతో బన్నీ ఫ్యామిలీ దిగిన ఫొటో వైర్ అవుతోంది. ఇందులో వరుణ్ తేజ్, లావణ్యలు పెళ్లి డ్రెస్సులో ఉన్నారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డితో తో పాటు వారి కుమారులు ఉన్నారు. ఎంతో హ్యాపీగా కనిపిస్తున్న ఈ పిక్ ఆకట్టుకుంటోంది. ఇక నాగబాబు కూతురు, వరున్ తేజ్ చెల్లెలు నిహారిక చాల అల్లరిగా కనిపించింది. అన్నా వదినలపై చేయి వేసి గట్టిగా నవ్వేస్తోంది. ఈపిక్ ను చూసి నాగబాబు ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉందో అర్థమవుతుంది.

ఈ వేడుకకు హీరో నితిన్ సందడి చేశారు. నితన్ తన సతీమణి షాలినితో కలిసి పెళ్లిక ముందే ఇటలీకి వచ్చారు. ఆయన ఎయిర్ పోర్టులో ఉన్న సమయంలో వీడియో వైరల్ అయింది. వరుణ్ తేజ్, లావణ్యల వివాహం పూర్తయిన తరువాత నితిన్ కొత్త జంటతో స్పెషల్ గా ఫొటో తీయించుకున్నారు. ఇందులో నిత్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అటు మెగా డాటర్ శ్రీజ కూడా ఈ వేడుకలో మెరిశారు. అన్నా వదినలతో కలిసి ఫొటో తీయించుకున్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
View this post on Instagram