Pawan-Mahesh Multistarrer: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ ఇద్దరి హీరోలను అభిమానులు ఆరాధ్య దైవంలాగా భావిస్తారు..వీళ్ళ మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా ఒక్కరిని ఒక్కరు ఎంతో గౌరవించుకుంటారు..మహేష్ బాబు సినిమా అర్జున్ పైరసీ కి గురైనప్పుడు ఇండస్ట్రీ నుండి స్పందించి ఆయనకీ మద్దతుగా నిలిచినా మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే..అలాగే పవన్ కళ్యాణ్ జల్సా సినిమాకి కూడా మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించాడు..అలా వీళ్లిద్దరి మధ్య మంచి సన్నిహిత్య సంబంధమే ఉంది..అయితే వీళ్ళిద్దరిని కలిపి ఒక్కే సినిమాలో చూడాలి అనే కోరిక అభిమానుల్లో ఎప్పటి నుండో ఉంది..కానీ ఎన్ని మల్టీస్టార్ర్ర్ సినిమాలు ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నా కూడా, ఈ కాంబినేషన్ మాత్రం ఇప్పటికి కలగానే మిగిలిపోయింది..కనీసం వీళ్లిద్దరు కలిసి ఒక్క ఫోటో దిగితే చూడాలి అనుకునే అభిమానులు లక్షల్లో ఉన్నారు.

మహేష్ బాబు కూడా ఇటీవల ప్రతి ఒక్క స్టార్ హీరో తో కలిసి ఫోటోలు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి..కానీ పవన్ కళ్యాణ్ తో మాత్రం ఇప్పటి వరుకు ఒక్క ఫోటో కూడా దిగలేదు..అప్పుడెప్పుడో అర్జున్ సినిమా పైరసీ జరిగినప్పుడు ఇద్దరు కలిసి దిగిన ఒక్క ఫోటో, అలాగే మహేష్ బాబు యువరాజు సినిమా ప్రారంభోత్సవం లో ఇద్దరు కలిసి దిగిన మరో ఫోటో, ఈ రెండు ఫోటోలు మాత్రమే ఇప్పటికి సోషల్ మీడియా లో సిర్క్యులేషన్ లో ఉన్నాయి..వీళ్లిద్దరికీ కామన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి సన్నిహితుడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ కాంబినేషన్ ని కేవలం ఆయన మాత్రమే తెరకెక్కించగలడు అని అభిమానుల నమ్మకం..కానీ ఈ కాంబినేషన్ ని గతం లో ఒక్క డైరెక్టర్ సినిమాని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేసాడు..ఇద్దరికీ ఆయన చెప్పిన స్టోరీ నచ్చింది కూడా..కానీ సెట్స్ మీదకి వెళ్ళేందుకు మాత్రం ఈ సినిమా కార్య రూపం దాల్చలేదు..ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు..మెహర్ రమేష్.

Also Read: Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్ జీవితంలో దాచేసిన ఆ ప్రేమ కథ ఇదీ!
మెహర్ రమేష్ బిల్లా సినిమా తర్వాత మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యడానికి కథని సిద్ధం చేసాడు..పవన్ కళ్యాణ్ కి మెహర్ రమేష్ చుట్టరికంగా తమ్ముడు వరుస అవ్వడం తో ఆయనతో మంచి సన్నిహిత సంబంధం ఉండేది..అలాగే మహేష్ బాబు కి కూడా మెహర్ రమేష్ మంచి క్లోజ్..ప్రస్తుతం మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలు అన్ని మెహర్ రమేష్ చూసుకుంటున్నాడు..ఇలా ఇద్దరి హీరోలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండడం తో మెహర్ రమేష్ వాళ్ళిద్దరిని ఒక్క సినిమాలో నటింపచేయడానికి ఒప్పించడం చాలా తేలిక అయ్యింది..కానీ అదే సమయం లో మెహర్ రమేష్ తెరకెక్కించిన శక్తి మరియు షాడో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అతి ఘోరమైన పరాజయాలు పాలవ్వడం తో మహేష్ బాబు ఈ సినిమా నుండి తప్పుకున్నాడు..మహేష్ తప్పుకోవడం తో పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి జారుకున్నాడు..అలా మెహర్ రమేష్ తెరకెక్కించాలి అనుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది..ప్రస్తుతం మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో ఆయన దర్శకుడిగా తనని తానూ ప్రూవ్ చేసుకుంటే మహేష్ పవన్ లు ఛాన్స్ మరొక్క ఇస్తారేమో చూడాలి.

Also Read: Acharya Disaster: ఆచార్య అపజయానికి కారణాలేంటి?
Recommended videos



[…] […]