Pawan Kalyan New Look: ప్రస్తుతం టాలీవుడ్ లో తమ హీరో సినిమాల లైనప్ పూర్తిగా అయ్యోమయ్యం లో పడిన ఫాన్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని చెప్పొచ్చు..ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు అంటూ పవన్ కళ్యాణ్ జోడి గుర్రాల స్వారీ చేస్తూ ఒక పక్క నిమ్రతలను మరో పక్క అభిమానులను పిచ్చెక్కిస్తున్నాడు. ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం ఏది విడుదల అవ్వబోతుంది అంటే టక్కుమని చెప్పలేని పరిస్థితి లో అభిమానులు ఉన్నారు..వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్..తన తదుపరి చిత్రం ‘హరిహర వీర మల్లు’ షూటింగ్ లో కొద్దీ రోజులు పాల్గొన్నాడు. కరోనా లాక్ డౌన్ కి ముందు దాదాపుగా 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం..లాక్ డౌన్ తర్వాత కేవలం రెండు చిన్న షెడ్యూల్స్ మాత్రమే జరుపుకుంది. ఇంకా నలభై శాతం కి పైగా షూటింగ్ బాలన్స్ ఉంది..ఇప్పటికే ఈ సినిమాకి వేసిన భారీ సెట్స్ కి అద్దె చెల్లిస్తూనే ఉన్నారు ఆ చిత్ర నిర్మాత AM రత్నం..పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వీరంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు..కానీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పష్టత రాకపోవడం తో వీళ్లంతా అయ్యోమయ్యం లో పడిపోయారు.

Also Read: Minister Roja Assets: రోజా ఆస్తుల వివరాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో యాక్టీవ్ అయ్యాడు..దీనితో అసలు పవన్ కళ్యాణ్ సెట్స్ మీదున్న హరిహర వీర మల్లు షూటింగ్ ని పూర్తి చేస్తాడా లేదా అనే సందేహం లో పడిపోయారు అభిమానులు..ఇటీవల కాలం లో పవన్ కళ్యాణ్ మార్చిన లుక్స్ ని చూసి కొత్త సందేహాలు మొదలయ్యాయి..ఎందుకంటే భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు సినిమా కోసం కోర మీసం మరియు పొడవాటి జుట్టు ని పెంచారు..మధ్యలో ఆయన రాజకీయ పర్యటనలు చేస్తున్నప్పటికీ కూడా తన లుక్ ని సినిమా కోసం మార్చలేదు..కానీ ఇప్పుడు ఆయన లేటెస్ట్ లుక్ చూసి అసలు హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ ఇప్పట్లో జరుగుతుందా??..అసలు భవిష్యత్తులో అయినా ఈ సినిమా ప్రారంభం అవుతుందా లేదా ?? అనే సందేహం లో పడిపోయారు అభిమానులు..మొన్నీమధ్యనే పవన్ కళ్యాణ్ తమిళం సూపర్ హిట్ అయినా వినోదయ్యా సీతం రీమేక్ లో నటించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి.
గుట్టుచప్పుడు కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి..జులై 10 వ తారీకు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అన్నారు..కానీ ఇప్పటి వరుకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదట..మరో పక్క ఎప్పుడో రెండేళ్ల క్రితం ప్రకటించిన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ మూవీ ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరుకు కనీసం పూజ కార్యక్రమాలు కూడా జరగలేదు..ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ హోల్డ్ లో పెట్టి పూర్తి ద్రుష్టి రాజకీయాల మీదనే పెట్టినట్టు తెలుస్తుంది..దీని అర్థం 2024 వ సంవత్సరం వరుకు పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి సినిమా విడుదల అవ్వదా??..భీమ్లా నాయక్ చిత్రమే ఆయన ఎన్నికల ముందు నటించిన ఆఖరి చిత్రం గా నిలవబోతుందా అనే భయం అభిమానుల్లో నెలకొంది..మరి దీనికి పవన్ కళ్యాణ్ తన చర్యల ద్వారా ఎలాంటి సంకేతం ఇస్తాడో చూడాలి.
Also Read:Dil Raju: దిల్ రాజు పై ఇలా సొంత మనుషులే తిరుగుబాటు.. కారణం ఇదే
[…] Also Read: Pawan Kalyan New Look: అభిమానులను భయపెడుతున్న పవన్… […]
[…] Also Read: Pawan Kalyan New Look: అభిమానులను భయపెడుతున్న పవన్… […]