
Devudu Pawan : పవన్ కళ్యాణ్ వినోదయ సితం రీమేక్ షూట్ చకచకా పూర్తి చేస్తున్నారు. ఆరు నెలల టార్గెట్ తో బరిలో దిగిన యూనిట్ ఆగస్టులో మూవీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందు పవన్ కళ్యాణ్ పార్ట్ పూర్తి చేయబోతున్నారు. పవన్ కేవలం 20 నుండి 25 రోజులు మాత్రమే ఈ చిత్రానికి కేటాయించారట. చెప్పిన సమయానికి ఆయన సన్నివేశాలు పూర్తి చేసేలా మేకర్స్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఇక సెట్స్ నుండి వర్కింగ్ స్టిల్స్ లీకయ్యాయి. రెడ్ షర్ట్ ధరించిన పవన్ కళ్యాణ్ కారుపై స్టైల్ గా కూర్చొని ఉన్నారు. ఎదురుగా సాయి ధరమ్ తేజ్ ఉన్నారు.
వీరిద్దరికీ దర్శకుడు సముద్రఖని సీన్ వివరిస్తున్నారు. పవన్ లుక్ ఆసక్తి రేపుతుండగా లీక్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రానికి దేవుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదట దేవర, భగవంతుడు వంటి టైటిల్స్ అనుకున్నారట. అయితే దేవుడు బెటర్ అని దానికి ఫిక్స్ అయ్యారట.

కాగా ఈ చిత్రంలో పవన్ భగవంతుడిగా కనిపించనున్నారు. దేవుడు పవన్ మానవుడు సాయి ధరమ్ మధ్య జరిగే హిలేరియస్ డ్రామా ఆకట్టుకోనుంది. అంతర్లీనంగా ఓ సందేశం ఉంటుంది. తమిళంలో వినోదయ సితం మంచి విజయం సాధించింది. సముద్రఖని నటించి దర్శకత్వం వహించారు. ఆయన చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అయితే తమిళ వెర్షన్ కి దర్శకుడు త్రివిక్రమ్ సమూల మార్పులు చేశారట. పవన్ ఇమేజ్ కి తగ్గట్లు హంగులు అద్దారట. ఓ సరికొత్త పవన్ ని దర్శకుడు ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రానికి పవన్ రెమ్యూనరేషన్ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయేలా చేసింది. ఏకంగా రూ. 80 కోట్లు తీసుకుంటున్నారట. అంటే రోజుకు ఆయన రూ. 4 కోట్లు ఛార్జ్ చేసినట్లు అయ్యిందని అంచనా వేస్తున్నారు. మొదటిసారి సాయి ధరమ్ తేజ్ మామయ్యతో కలిసి నటిస్తున్నారు. మెగా హీరోల మల్టీస్టారర్ కావడం ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత. కాగా హరి హర వీరమల్లు షూట్ సైతం పవన్ పూర్తి చేస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నారు.