
Lala Bheemla Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న మళయాలి సినిమా ‘అయ్యప్పనుం కోషియుం’. ఈ సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. లాలా.. బీమ్లా.. అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్‌ను తివిక్రమ్ రాయడం విశేషం. అయితే నేడు త్రివిక్రమ్ బర్త్ డే.. ఈ సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేసి త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు భీమ్లా నాయక్ టీమ్ చిన్న సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఇక ఈ సాంగ్ లో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ లిరిక్స్ సాగాయి. దాంతో ఈ పాట పవన్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే భీమ్లా టైటిల్ సాంగ్ కూడా బాగా హిట్ అయింది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాట ఒక మాస్ సాంగ్. పవన్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సాంగ్. అందుకే ఈ సాంగ్ కోసం భారీ సెట్స్ వేసి సాంగ్ ను షూట్ చేశారు.
అన్నట్టు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సతీమణిగా నిత్య మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ అయిన పవన్ – నిత్యా పోస్టర్ చాలా బాగుంది. నిత్యా మీనన్ ఫార్మల్ పంజాబీ డ్రెస్ లో కనిపించగా.. పవన్ కళ్యాణ్ కూడా ఫార్మల్ లుక్ లో కనిపించాడు. మొత్తానికి ఈ మాస్ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అవ్వడానికి ఇది కూడా ఒక కారణం.
అలాగే భీమ్లా నాయక్ ఫస్ట్ టీజర్ కూడా పవన్ పై స్పెషల్ గా కంపోజ్ చేయడం, ముఖ్యంగా పవన్ చాలా ఆవేశంగా నడుచుకుంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. మొత్తానికి భీమ్లా నాయక్ గా పవన్ , డ్యానియల్ శేఖర్ గా రానా పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఈ సినిమా ఈగో మీద నడవబోతుంది. నువ్వా – నేనా అంటూ పోటీ పడే ఇద్దరి ఆవేశపరుల కథ ఇది.
ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి స్పెషల్ గా జనవరి 12, 2021కి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు.
Also Read: లాలా భీమ్లా.. అడవి పులి.. మాస్ సాంగ్‌తో దుమ్ములేపుతున్న భీమ్లానాయక్!