SriDevi Drama Company Show: ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..జబర్దస్త్ నుండి ప్రారంభమైన ఈ ట్రెండ్ ఈటీవీ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కి నాంది పలికింది..ఇక ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కూడా మంచి ఆదరణ ని దక్కించుకుంది..మొదట్లో సుడిగాలి సుధీర్ యాంకర్ గా టాప్ లీడింగ్ జబర్దస్త్ కమెడియన్స్ అందరూ ఈ షో లో పాల్గొని సందడి చేసేవారు.

అయితే కొన్ని నెలల క్రితం ఈటీవీ ని వదిలి మరో చానెల్స్ కి సుధీర్ షిఫ్ట్ అవ్వగా..అప్పటి నుండి యాంకర్ రష్మీ ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తుంది..ఇప్పుడు ఈ వారం ప్రసారం అవ్వబొయ్యే ఎపిసోడ్ కి సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ ఇచ్చాడు..ఈ షో కి సంబంధించిన ప్రోమో ని విడుదల చెయ్యగా అది సోషల్ మీడియా సెన్సేషన్ సృష్టిస్తుంది..అయితే ఈ ప్రోమో పై పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియా లో చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తీన్ మార్’ సినిమాలోని ‘గెలుపు తలుపులే’ తీసే అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..శ్రీరామ చంద్ర పాడిన ఈ పాట క్లాసికల్ హిట్ అయ్యింది..ఈ పాట ని బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ ‘భాను శ్రీ’ ఈ ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాడుతుంది..దరిద్రంగా గొంతు తో పాట పాడడమే కాకుండా దానికి జడ్జీలు మరియు అక్కడ ఉన్న కమెడియన్స్ , యాంకర్స్ ఎమోషనల్ ఫీల్ అవ్వడం ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు.

మా హీరో సినిమాలో క్లాసికల్ హిట్ గా నిలిచినా పాట ని ఖూనీ చేసేశారంటూ ఆరోపిస్తున్నారు..ఇప్పుడు భానుశ్రీ గారిలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని చూపించమని మేము ఎమన్నా అడిగామా..ఎం పాపం చేశామని మాకు ఈ టార్చర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వేస్తున్నారు..ఇంతలా విమర్శలపాలైన ఆ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.
