
ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారుగా 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు..పవన్ కళ్యాణ్ తన జల్సా రికార్డు ని తానే బద్దలు కొట్టాడు..ఇలా పవర్ స్టార్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ బ్లాక్ బస్టర్స్ అవ్వడం తో నిర్మాతలు ఆయన ఫ్లాప్ సినిమాలను సైతం రీ రిలీజ్ చెయ్యడానికి ముందుకు వస్తున్నారు..పవన్ కళ్యాణ్ కెరీర్ ఫ్లాప్ గా నిలిచిన ‘తీన్మార్’ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ రీ మాస్టర్ చేయించి అతి త్వరలోనే విడుదల చెయ్యబోతున్నాడు.
ఈ విషయాన్నీ స్వయంగా బండ్ల గణేష్ అధికారికంగా ప్రకటించాడు.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో ఫ్లాప్ చిత్రం ‘గుడుంబా శంకర్’ ని కూడా రీ మాస్టర్ చేసి రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు కూడా ప్రారంభం అయ్యాయి..ఆ చిత్ర నిర్మాత నాగబాబు ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యబోతున్నాడు అట..వీటితో పాటు ఈ ఏడాది తొలిప్రేమ , బద్రి వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వబోతున్నాయి.